అక్కడకెళ్లినా పేషెంట్లు కావల్సిందేనా..?

ప్రముఖులకు సవాల్ విసురుతున్న లిఫ్టులు…

దిశ దశ, కరీంనగర్:

రోగాలను నయం చేయాల్సిన చోట రోగులుగా మారాల్సిన దుస్థితి తయారైందా..? ఆరోగ్యం పంచాల్సిన చోట అనారోగ్యం అందుతోందా..? వైద్య విధానానికే సవాల్ విసురుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది.

లిఫ్టుల పరిస్థితి…

కరీంనగర్ ప్రైవేటు వైద్య శాలల్లో చికిత్స చేయించుకునే పేషంట్లే కాదు… వారిని చూసేందుకు వచ్చే వారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. కరీంనగర్ ఆసుపత్రుల్లో సాగుతున్న ఈ తంతును నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. పేషంట్లు, అటెండెంట్లు, ఆసుపత్రుల్లో పనిచేసే వారు వెల్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్టుల పరిస్థితిని గమనిస్తే ప్రైవేటు దవాఖానాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థ చేసుకోవచ్చు. తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమర్ స్థానిక వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంటును చూసేందుకు వెళ్లారు. అయితే లిఫ్టులో వెలుతున్న క్రమంలో వైర్లు తెగడంతో లిఫ్ట్ కిందకు జారిపోయింది. తక్కువ ఎత్తుకు చేరిన క్రమంలో లిఫ్ట్ తెగడంతో ప్రాణాపాయం తప్పింది. లేనట్టయితే పేషంట్ ను చూసేందుకు వెళ్లిన మంత్రి అదే ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన దుస్థితి ఎదురయ్యేది.

గతంలో…

గతంలో లిఫ్టులు మోరాయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రముఖులు చాలా మంది లిఫ్టుల్లో చిక్కుకోవడమో అవి జారీ పడడం వల్లనో ప్రమాదాల బారిన పడ్డ సంఘటనలు ఉన్నాయి. అయితే లిఫ్టులను ఏర్పాటు చేసుకునే విషయంలో ప్రైవేటు వైద్య శాలల యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలు ఆందోళన కల్గిస్తున్నాయి. పేషంట్లను ఆసుపత్రులకు రప్పించుకునే విషయంలో చూపిస్తున్న శ్రద్ద సౌకర్యాలను కల్పించే విషయంలో చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో అయితే ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రులు కూడా లిఫ్టు ప్రమాదాల్లో చిక్కుకున్నారు. లిఫ్టులు ఏర్పాటు చేసేప్పుడే వాటి సామర్థ్యానికి తగ్గట్టుగా వైర్లను, ఇతరత్రా సాంకేతిక పరికరాలను బిగిస్తారు. ఆ తరువాత కూడా వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విషయంలో కఠినంగా నడుచుకుంటారు. కానీ కరీంనగర్ ఆసుపత్రుల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించడం లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అధికారుల స్పందన…

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లిఫ్ట్ ప్రమాదం ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మంత్రి ఫిర్యాదు తరువాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. వన్ ఆసుపత్రి పాటు పలు ప్రైవేటు దవాఖానాల్లో తనిఖీలు చేశారు. క్లినికల్ ఎస్టాబ్లీష్ మెంట్ చట్టం ప్రకారం నిబంధనలు పాటించారా లేదా అన్న విషయాలపై ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ వెంకట రమణ స్పష్టం చేశారు.

ADLURI LAXMAN KUMARIMAkarimnagarMEDICAL MAFIAPrivate hospitals
Comments (0)
Add Comment