ఎంవీఐ విధుల్లో కానిస్టేబుల్..!

ఏసీబీ విచారణలో సంచలన విషయాలు…

దిశ దశ, జగిత్యాల:

మెటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ (MVI) నిర్వర్తించాల్సిన విధులను రవాణా విభాగం కానిస్టేబుల్ నెరుపుతున్నారు. డ్రైవింగ్ టెస్టులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారాలను సైతం కానిస్టేబుల్ ఎన్ గిరీష్ పర్యవేక్షిస్తున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు విషయాలను గుర్తించిన ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించనున్నారు. ఏజెంట్ల ద్వారా డబ్బులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని, సాధారణ ప్రజలకు సంబంధించిన పనులను చక్కబెట్టేందుకు ఏజెంట్లు కోరుట్ల రవాణా కార్యాలయంలోకి స్వేచ్ఛగా చేరుకుంటున్నారని ఏసీబీ గుర్తించింది. పనులు పూర్తయ్యే వరకు కూడా ఏజెంట్లు సంబంధిత విభాగాల సిబ్బంది వద్దే ఉండిపోతున్నారని తేల్చింది. రికార్డులు, రిజిస్టర్లను నిర్వహించడంలో వైఫల్యాలు ఉన్నాయని, ఆయా సెక్షన్లలో పని చేస్తున్న యంత్రాంగానికి అప్పగిస్తున్న పనుల తీరుపై పర్యవేక్షణ కూడా లేకుండా పోయిందని గుర్తించింది. డ్రైవింగ్ టెస్టులు చేసే ప్రాంత రవాణా శాఖా నిబంధనలకు అనుగుణంగా లేదని, డ్రైవింగ్ ట్రాక్ పై కనీసం సైన్ బోర్డులు కూడా లేవని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది.

ACB RAIDSACB searchesACB TELANGANAJAGITIALTELANGANA ACB
Comments (0)
Add Comment