కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో అనూహ్య పరిణామం…

ఆ సమయంలో వెళ్లిపోయిన కేంద్ర మంత్రి

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కలెక్టరేట్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వేడుకల్లో అన్ని చోట్ల కనిపించినప్పటికీ ఆ సమయంలో మాత్రం దూరంగా ఉండడం చర్చకు దారి తీసింది. బుధవారం చోటు చేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ కలెక్టరేట్ నూతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే కలెక్టర్ నూతన ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో మొదట హిందూ సాంప్రాదాయం ప్రకారం ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సీఎం రేవంతో రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వెనుదిరిగారు. అయితే ఇంఛార్జి మంత్రి వారిని వెనక్కి పిలిచి సర్వమత ప్రార్థనలు నిర్వహించాల్సి ఉందన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ కుర్చి సమీపంలోకి చేరుకున్నప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం అక్కడి నుండి వెళ్లిపోయారు. ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన ఆశీర్వచన కార్యక్రమానికి దూరంగా ఉన్న బండి సంజయ్ ఆ తరువాత సీఎం ప్రసంగించిన వేదికపై కనిపించడం గమనార్హం.

bandi sanjaycm revanth reddyIDOC BULDINGkarimnagarTG NEWS
Comments (0)
Add Comment