కలెక్టరేట్ రోడ్ క్లోజ్… భవనాలపైకి ఎవరూ రావద్దు…

సీఎం పర్యటన నేపథ్యంలో హై అలెర్ట్…

దిశ దశ, కరీంనగర్:

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కరీంనగర్ లో హై అలెర్ట్ ప్రకటించారు. అడగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ రోడ్ మొత్తాన్ని క్లోజ్ చేసేశారు. ప్రతిమ మల్టిప్లెక్స్ T జంక్షన్ నుండి భగత్ నగర్ T జంక్షన్ వరకూ కేవలం ట్రాఫిక్ ఆంక్షలతోనే సరిపెట్టలేదు పోలీసు అధికారులు ఆ రోడ్డులోని వ్యాపార, వాణిజ్య లావాదేవీలు జరపకుడదని సూచించారు. ఈ రహదారిలోని షాపులను ఓపెన్ చేయకూడదని స్పష్టం చేశారు. బుధవారం మద్యాహ్నం 4 గంటలకు సీఎం రేవంత్ రానున్నప్పటికీ ఈ రహదారి మొత్తాన్ని కూడా బుధవారం ఉదయం నుండి పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా కలెక్టరేట్ సమీపంలోని ఇండ్లలో నివసిస్తున్న వారు కూడా భవనాలపైకి వచ్చి వీక్షించవద్దని కూడా స్పష్టం చేశారు. రక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడిస్తున్నారు పోలీసులు.

అక్కడే…

అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కేవలం కలెక్టర్ ప్రాంగణానికే పరిమితం అయినప్పటికీ పోలీసులు మాత్రం మొత్తం రహదారిని క్లోజ్ చేయడం గమనార్హం. సీఎం కలెక్టరేట్ ఆవరణలోనే వివిధ కార్యక్రమాలకు హాజరయి నూతన భవనం సమీపంలో కొత్తగా నిర్మించిన హెలిప్యాడ్ నుండి సిరిసిల్లకు టూర్ కు బయలుదేరుతారు.

cm revanth reddyCOLLECTORATEIDOC BULDINGkarimnagar newsTG NEWS
Comments (0)
Add Comment