రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి… సన్నాల బ్రాండ్లు వేసి…

కరీంనగర్ మిల్లుల్లో నయా దందా…

పద్మానగర్ రైస్ మిల్లుపై పోలీసుల దాడి…

దిశ దశ, కరీంనగర్:

సామాన్యుడికి సన్న బియ్యం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు అక్రమార్కులు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో సర్కారు సరఫరా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి డబ్బు గడించేందుకు బ్రాండెడ్ కంపెనీల పేర్లను వాడుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ టూ టౌన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ మిల్లుపై చేసిన దాడితో సంచలన విషయాలు బయటపడ్డాయి. కరీంనగర్ టూ టౌన్ ఇన్స్ పెక్టర్ సృజన్ రెడ్డి కథనం ప్రకారం… పద్మనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని హనుమాన్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై మంగళవారం దాడులు చేశారు. ఆ సోదాల్లో 306.88 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ బియ్యాన్ని, ఒక ట్రాలీ ఆటోను పట్టుకున్నారు. మిల్ యజమాని తొడుపునూరి కరుణాకర్ (50), గుమస్తా కొమ్మల్ల తిరుపతయ్య, అకౌంటెంట్ బోనాల సుమ శ్రీ, సప్లయర్ కట్ట మురళీధర్, డ్రైవర్ మల్క తిరుపతిలపై కేసు నమోదు చేశారు. నిందితులకు బీఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చారు.

బ్రాండెడ్…

అయితే హనుమాన్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో పోలీసులు దాడులు చేసినప్పుడు సంచలన విషయాలు బయటపడ్డాయి. రేషన్ దుకాణాల ద్వారా సరఫరా కావల్సిన బియ్యాన్ని ఏజెంట్ల ద్వారా సేకరించి పాలిషింగ్ చేసి బ్రాండెడె కంపెనీలకు చెందిన సన్నాలని ఓపెన్ మార్కెట్ కు తరలిస్తున్నట్టుగ తేలింది. BPT, HMT, No1 Kurnool, Tamato Gold, JSR, Kisan, Raja Gold, Double House, Annapurna బ్రాండ్ల పేరిట రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయా కంపెనీలకు చెందిన బ్రాండ్ల ముద్రలు వేసిన సంచుల్లో రేషన్ బియ్యాన్ని నింపి విక్రయానికి తరలిస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తెలిపారు.

crimepds rice smuglingRation riceSmuggling of ration riceTG NEWS
Comments (0)
Add Comment