లంచం తీసుకుంటూ జీపీఓ ట్రాప్…

దిశ దశ, హుజురాబాద్:

ఓ రైతు నుండి లంచం తీసుకుంటున్న జీపీఓను ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ అనంతరం వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ జీపీఓ శ్రీనివాస్ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఓ రైతు వద్ద లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు కరీంనగర్ రేంజ్ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆద్వర్యంలో ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం జీపీఓను ట్రాప్ చేశారు. ఫినాప్తలిన్ పరీక్షలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచేందుకు సమాయత్తం అవుతున్నారు.

ACB searchesACB TELANGANAACB TrapLatest NewsTELANGANA ACB
Comments (0)
Add Comment