జగిత్యాల జిల్లాలో ఘటన
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుని ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది. జిల్లాలోని గొల్లపల్లి మండలం చిలువకోడూరు ప్రాథమిక పాఠశాల ఇంఛార్జి హెడ్మాస్టార్ ప్రశాంత్ మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యాశాఖ అధికారుల ఒత్తిళ్ల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని ప్రశాంత్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఎంఈఓ చెరుకు రాజన్నతో పాటు జీవన్ రెడ్డిల వల్లే తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. తనను పదేపదే టార్గెట్ చేయడం వల్లే మానసిక వేదనకు గురయ్యాయనని బాధిత టీచర్ వెల్లడించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కూడా ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. లక్ష్యాన్ని నిర్దేశిస్తున్న ప్రభుత్వ టీచర్లను నియమించకున్నప్పటికీ విద్యా వాలంటీర్లను అయినా నియమించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా కలకలం లేచింది.