సైబర్ నేరాల్లో బ్యాంకర్లపైనా కేసులు…

తాజాగా హైదరాబాద్ లో 32 మంది అరెస్ట్…

దిశ దశ, హైదరాబాద్:

వివిధ మార్గాల ద్వారా డబ్బులు దోచుకుని అకౌంట్లకు బదిలీ చేసుకుని విదేశాలకు డబ్బు తరలించుకపోతున్న సైబర్ నేరగాళ్లతో మిలాఖత్ అయిన ప్రతి ఒక్కరిపైనా కేసులు తప్పవని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా 32 మంది బ్యాంక్ అధికారులనూ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

కరీంనగర్ నుండే…

కరీంనగర్ పోలీసులు ఇటీవల భారీ నెట్ వర్క్ ను ఛేదించారు. రూ. 138 కోట్ల మేర నగదును తరలించుకపోయేందుకు మ్యూల్ అకౌంట్లను వాడుకున్నారని, ఇందుకు బ్యాంకు అధికారులు కూడా చేతులు కలిపారని గుర్తించారు. పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు RBL బ్యాంక్ కరీంనగర్ బ్రాంచ్ లో పని చేస్తున్న మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషీయర్ అయేషా బేగంలపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి వరకు కమిషన్ కోసం ఆశపడి మ్యూల్ అకౌంట్లు తెరిచిన వారిపై, సైబర్ క్రిమినల్స్ తో జట్టు కట్టిన వారిపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకునేవారు. కానీ కరీంనగర్ పోలీసులు మ్యూల్ అకౌంట్ల వెనక బ్యాంకు యంత్రాంగం హస్తం ఉందా అన్న అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చాయి. మ్యూల్ ఖాతాల్లో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉందని గుర్తించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే బ్యాంక్ ఉద్యోగులను మ్యూల్ ఖాతాల విషయంలో బాధ్యులను చేయడం సరికాదన్న వాదనలు వినిపించారు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో కూడా బ్యాంకు అధికార యంత్రాంగం ప్రమేయం ఉన్నట్టుగా కేసులు నమోదు అవుతుండడం గమనార్హం.

32 మందిపై…

సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లోని సైబర్ క్రిమినల్స్ వ్యవహారంపై CBI జోక్యం చేసుకుంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా అందులో ఓ ప్రైవేట్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. రూ. 150 కోట్ల మేర లావాదేవీలు జరిగిన ఈ కేసులో 52 మందిని హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ చేయగా వీరిలో 32 మంది వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు ఉన్నారు. మ్యూల్ అకౌంట్లు తెరిచేందుకు వీరు తమవంతు సహకారం అందించారని పోలీసుల విచారణలే తేలింది. ఇక నుండి సైబర్ క్రిమినల్స్ నగదను అక్రమంగా తరలించుకపోవడంలో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు తేలడం విశేషం. ఇక నుండి మ్యూల్ అకౌంట్ల విషయంలో బ్యాంకుల్లో పనిచేస్తున్న వారిని నిందితులుగా చేర్చడం వల్ల భారీ నెట్ వర్క్ కు మొదట్లోనే చెక్ పెట్టినట్టు అవుతుందని అంచనా వేస్తున్నారు.

Cyber crimeHYDERABAD POLICEmule accountstelangana policeVC SAJJANAR IPS
Comments (0)
Add Comment