కరీంనగర్ గ్రానైట్ క్వారీల అక్రమాలు… ఈడీ అధికారులపై DOPTకి ఫిర్యాదు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ గ్రానైట్ రీచుల నుండి ఎగుమతిలో చోటుచేసుకున్న అక్రమాల వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులపై కూడా ఫిర్యాదు వెళ్లింది. ED అధికారుల బృందం సోదాలు నిర్వహించిన తరువాత విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ఆధారంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ (DOPT)కి ఫిర్యాదు చేశారు.

నోట్ ఆధారంగా…

కరీంనగర్ గ్రానైట్ బ్లాకులను అక్రమంగా తరలించారని, సీనరేజ్ ఫీజ్ ఎగవేశారంటూ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. ఈ  అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా గతంలో EDకి ఫిర్యాదు వెళ్లింది. దీంతో 2022 నవంబర్ 10వ తేదీన హైదరాబాద్, కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ క్వారీలు, నిర్వాహాకులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి ED బృందాలు. శ్వేత గ్రానైట్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్సార్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ లలో సోదాలు నిర్వహించామని 2022 నవంబర్ 11న ED అధికారులు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. FEMA నిబంధనల అతిక్రమణ జరిగిందని, చైనా, హాంగ్ కాంగ్ తో పాటు పలు దేశాలకు గ్రానైట్ ఎగుమతి చేసే విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ED పేర్కొంది. రాయల్టీ చెల్లించిన పరిమాణం కంటే ఎక్కువగా ఎగుమతి చేసినట్టుగా గుర్తించామని, రూ. 1.08 కోట్ల నగదు రికవరీ చేశామని, 10ఏళ్లకు సంబంధించిన గ్రానైట్  వివరాలు సేకరించామని, ఉద్యోగుల పేరిట తీసిన బినామీ అకౌంట్ల ద్వారా నిబంధనలకు విరుద్దంగా లావాదేవీలు జరిపినట్టుగా తేలిందని ED స్పష్టం చేసింది. ఎలాంటి డాక్యూమెంట్లు లేకుండా హైండ్ లోన్ తీసుకున్నట్టుగా చైనా కంపెనీల నుండి లావాదేవీలు జరిగాయని గుర్తించినట్టుగా వెల్లడించింది. పనమా లీక్స్ లో పేరున్న లీ వెన్ హువో నిర్వహిస్తున్న సంస్థలని కూడా ED ప్రకటించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా గ్రానైట్ అక్రమ రవాణా, మైనింగ్, ఫెమా ఉల్లంఘనటపై ED దర్యాప్తు ప్రారంభించిందని, కరీంనగర్ జిల్లాలోనీ క్వారీల నుండి గూడ్స్ రైళ్లు, ఓడ రేవులకు చేరిన గ్రానైట్ బ్లాకులపై భారీ ఎత్తున సీనరేజ్ ఫీజు ఎగవేతను గుర్తించామని కూడా ప్రకటించింది.

ఫిర్యాదులు…

ED అధికారులు ఇచ్చిన ఈ ప్రెస్ నోట్ ఆధారంగా అప్పటి నుండి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ప్రధాన మంత్రి కార్యాలయానికి, భారత రెవెన్యూ సెక్రటరీ కార్యాలయంతో పాటు ఆయా విభాగాలకు ECIR నమోదు చేయలేదని కంప్లైంట్ లో వెల్లడించారు. భారత రెవెన్యూ కార్యదర్శి కార్యాలయం నుండి ఈడీ విజిలెన్స్ కు లేఖ పంపగా ఆ విభాగానికి చెందిన రాహుల్ నవీన్ అనే అధికారిని నియమించారు. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఢిల్లీ హైకొర్టులో రిట్ పిటిషన్ దాఖలు కాగా తాము విచారణ చేస్తున్నామని ఈడీ కోర్టుకు నివేదించింది. కరీంనగర్ గ్రానైట్ స్కాం విషయంలో కఠినంగా వ్యవహరంచాలని అభ్యర్థనలు చేశారు. మరోవైపున ED అధికారులపై DOPTకి కూడా ఫిర్యాదు చేశారు. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై వివరాలు సేకరించామని ప్రకటించినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని DOPTకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ED విభాగం 2022 నుండి ఈ కేసును పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ గ్రానైట్ ఎగుమతుల్లో రాయల్టీ ఎగవేతతో పాటు ఫెమా నిబంధనల పరిధిలోకి వచ్చే అంశాలు ఉన్నాయన్న విషయాలపై ED అధికారులు చర్యలు తీసుకోకపోవడం సరికాదని ఈ ఫిర్యాదులో స్పష్టం చేశారు. బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని కూడా ఫిర్యాదులో అభ్యర్థించారు.

edgranite scamgranite scam in telanganatg assemblyVigilance enforcement
Comments (0)
Add Comment