బావుపేట వద్దే నీరు ఎందుకు నిలుస్తోంది..?

గతంలోనూ ఆదేశించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

దిశ దశ, కరీంనగర్:

తెలంగాణాలో సుప్రసిద్ద దేవాలయానికి వెళ్లే ఆ రహదారిపై తరుచూ నీరెందుకు నిలుస్తోంది..? బావుపేట వద్దే రోడ్డు ఎందుకు డ్యామేజ్ అవుతోంది..? కేంద్ర మంత్రి గతంలో ఆదేశాలిచ్చినా చొరవ తీసుకోకపోవడానికి కారణమేంటీ..?

కరీంనగర్, సిరిసిల్ల రహదారిలోని బావుపేట వద్ద ఏటా నీరు వచ్చి చేరుతుండడం… రోడ్డు డ్యామేజ్ కావడం కామన్ అయింది. గతంలో కూడా ఇదే ప్రాంతం గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఇదే ప్లేస్ లో తన కాన్వాయిని ఆపి రోడ్డు దుస్థితిని చూసిన వెంటనే అప్పటి కలెక్టర్ పమేలా సత్పతికి కాల్ చేశారు. మంత్రి ఆదేశంతో క్షేత్ర స్థాయి సందర్శన చేసిన కలెక్టర్ రూ. 40 లక్షల నిధులు కెటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఆ తరువాత ఈ అంశం మరుగునపడిపోయింది. తాజాగా మరోసారి కేంద్ర మంత్రి సిరిసిల్ల పర్యటనకు వెలుతున్నప్పుడు అదే రోడ్డు వద్ద ఆగి పరిస్థితిని గమనించి తాజా కలెక్టర్ చిత్రా మిశ్రాకు కాల్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఒకే సమస్యను పరిష్కరించాలని ఇద్దరు కలెక్టర్లతో కేంద్ర మంత్రి మాట్లాడాల్సి రావడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమేనని అంటున్నారు స్థానికులు.

కారణమేంటీ..?

బావుపేట సమీపంలో ఉన్న ఓ కుంటలోకి వర్షాకాలం వరద నీరు తరలిపోయేందుకు రెండు కల్వర్టులు ఉండేవి. వాటిని తొలగించి ఓ కాలువ నిర్మాణం చేపట్టినప్పటికీ అర్థాంతరంగా నిలిచిపోయింది. దీంతో ప్రతి వర్షాకాలం బావుపేట వద్ద స్టేజ్ వద్దకు వరద నీరు వచ్చి చేరడం రోడ్డు డ్యామేజ్ అవుతుండడం కామన్ అన్నట్టుగా మారిపోయింది. గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించిన తరువాత హాడావుడి చేసిన అధికారులు శాశ్వత పరిష్కారం కోసం మాత్రం చొరవ చూపలేదు. తాజాగా జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు కాల్ చేసి మాట్లాడిన తరువాత అధికార యంత్రాంగం మరోసారి కదలింది. బావుపేట స్టేజ్ వద్దకు వచ్చి చేరి రోడ్డు డ్యామేజ్ అయిన చోట తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. అయితే ఏటా ఇదే సమస్య ఎదురవుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరుతున్న నీటిని కుంటకు మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవల్సి ఉంది. మరో వైపున కుంట శిఖం కూడా దురాక్రమణలకు గురవుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వరద నీరు కుంటలోకి చేరితో ఆక్రమించుకున్న భూమి ముంపునకు గురవుతుందన్న కారణంతో కొంతమంది అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరో వైపున ఇదే ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలు, క్వారీలు కూడా ఉన్నాయి. ఆయ చోట్ల వినియోగించే నీరు కూడా బావుపేట స్టేజ్ వద్దకు వచ్చి చేరుతోంది. ఇక్కడకు వచ్చి చేరుతున్న నీటిని దిగువకు వెల్లేందుకు అనువుగా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

bandi sanjay bjpbavupetakarimnagarsiricillavemulawada
Comments (0)
Add Comment