దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల శివార్లలో గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా సమాచారం. జగిత్యాల సమీపంలోని నూకపల్లి డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వెళ్లిన తరువాత ఇద్దరు యువకులు బాధితురాలిపై బలత్కారానికి ఒడిగట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఆమెపై అత్యాచారానికి ఒడి గడ్తున్న సమయంలో కాపాల కాసిన వారిని కూడా జగిత్యాల రూరల్ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితుల్లో ఒకరిద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు.