కంట్రీ మేడ్ అయినా ఖచ్చితంగా పట్టుకోవచ్చా..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ నగల దుకాణంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలేయడం లేదు. దొంగల ఆచూకి కోసం పోలీసులు ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే నగలు ఎత్తుకెళ్లుతున్నప్పుడు ఒక దొంగ షోరూం సమీపంలో కింద పడిపోయాడు. అప్పుడు 3.2 రివాల్సర్ కు సంబంధించిన మ్యాగ్జిన్ అక్కడే పడిపోయింది. పోలీసులు ఘటనా స్థలంలో వెదికినప్పుడు మ్యాగ్జిన్, కత్తి, కాల్చిన తూటాలు లభ్యం అయ్యాయి. అయితే ఇందులో మ్యాగ్జిన్ అత్యంత కీలకంగా మారింది. జర్మన్ మేడ్ వెపన్ లా కంట్రీమేడ్ ఆయుధాన్ని బీహార్ తయారు చేస్తారని పోలీసులు గుర్తించారు. అయితే కంట్రీ మేడ్ వెపన్ కావడంతో ముఠా ఆచూకిని దొరకబట్టడం ఆసాధ్యమని, కంపెనీలో తయారైనట్టయితే దానిపై ఉన్న నంబర్లు ఇతర ఆధారాల ద్వారా దానిని ఎవరికి విక్రయించారోనన్న విషయంపై స్ఫష్టత వస్తుందని అనుకున్నారు.

మార్క్…

అయితే కంట్రీ మేడ్ వెపన్స్ తయారీదారులు కూడా తమ మార్క్ ఉండే విధంగా డిజైన్ చేస్తారని తెలుస్తోంది. ఆయుధాలను తయారు చేసే ముఠాలు విదేశాల్లో తయారు చేసిన తుపాకులను కూడా రెడీ చేస్తుంటారు. అయితే ఆయుధాలను తయారు చేసేప్పుడు వాడే మెటిరీయల్ అంతా కూడా తమకు నచ్చినవే సేకరిస్తుంటారని, అలాగే ఎక్కడో ఓ చోట అవి తాము చేసినవేనని గుర్తించేందుకు గుర్తింపు కూడా ఉండే విధంగా జాగ్రత్త పడతారని తెలుస్తోంది. అయితే ఈ మార్క్ ఆధారంగా వాటిని ఎవరు తయారు చేశారు..? ఎవరికి అమ్మారు అన్న వివరాలు సేకరించినా ముఠా గురించి బయటపడనుందని సమాచారం. మ్యాగ్జిన్ ఆదారంగా కూడా పోలీసులు ముఠాను ఈజీగానే గుర్తించే అవకాశం ఉంటుందని స్పష్టం అవుతోంది. దీంతో కరీంనగర్ నగల షోరూం దోపిడీ సమయంలో కాల్పులు జరిపిన తుపాకుల నుండి జారి పడిన మ్యాగ్జిన్ కూడా పోలీసులకు కీలక ఆధారం కానుందని తెలుస్తోంది.

crimeGunfirekarimnagarLatest NewsTG NEWS
Comments (0)
Add Comment