దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్ పెక్టర్(RI)ని రెడ్ హైండెడ్ గా పట్టుకుంది. ACB అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని అంతర్గాం మండల రెవెన్యూ కార్యాలయంలో RIగా పని చేస్తున్న శ్రీమాన్ మండలంలోని రాయదండి గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వ్యవసాయ భూమి ఫీల్డ్ ఇన్స్ పెక్షన్ చేసేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో గురువారం రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ అనంతరం వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.