మావోయిస్టు పార్టీ లోగో మారిందా..?

NCC ప్రెస్ నోట్ పై చర్చ

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ శ్రేణులంతా జనజీవనంలోకి వస్తుంటే… ఆ పార్టీ పేరిట విడుదల అవుతున్న లేఖల వెనక ఉన్నదెవరూ..? కీలక నాయకత్వం నుండి క్షేత్ర స్థాయి సభ్యుని వరకు బాహ్య ప్రపచంలోకి అడుగు పెడుతున్న ఈ సమయంలో NCC పేరిట ప్రకటన జారీ కావడం సంచలనంగా మారింది.

లోగో మారిందా..?

ఈ నెల 17న మావోయిస్టు పార్టీ రాసినట్టుగా చెప్తున్న లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేతగా పని చేసి బయటకు వచ్చిన దేవ్ జీ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు. అయితే గతంలో పార్టీ సింబల్ ఒకటి అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ప్రెస్ నోటో లో మాత్రం పలువురు విప్లవకారుల ఫోటోలు ముద్రించారు. పార్టీలో ఏనాడూ లేని కొత్త కమిటీ ఈ లేఖలో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉత్తర సమన్వయ కమిటీ (Northern Coordination Committee) (NCC) పేరిట విడుదలైన లేఖపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టు పార్టీ నాయకత్వపై ఈ లేఖ విడుదల చేసినట్టయితే లోగో మార్చడానికి కారణం ఏంటీ..? NCC అనే కొత్త పేరును తెరపైకి తీసుకరావడమెందుకు..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆపరేషన్ కగార్ ద్వారా నక్సల్స్ ఏరివేత కొనసాగిన సమయంలో, పార్టీ అగ్ర నాయకత్వం ఎన్ కౌంటర్ లలో మరణించినప్పుడు కూడా బాజాప్తాగా పార్టీ లెటర్ హెడ్ లపై ప్రకటనలు విడుదల చేశారు. కానీ ఇప్పుడు మాత్రం కొత్త తరహా లేఖ ఎందుకు వాడారన్న చర్చ సాగుతోంది. యాక్టివ్ గా ఉన్న కేంద్ర కమిటీ సభ్యులే పార్టీలో లేనప్పుడు NCC పేరిట లేఖ రావడం వెనక ఉన్నదెవరూ అన్న అంశంపై కూడా తర్జన భర్జనలు సాగుతున్నాయి. ఇప్పటికీ DKSZCకి చెందిన పార్టీ క్యాడర్ జనంలోకి వస్తున్నారే కానీ ఇప్పటి వరకు NCC బాధ్యులు ఉన్నారన్ విషయం బయటకు రాలేదు. ఈ లేఖ మావోయిస్టులు ఉనికి ఇంకా ఉందని చెప్పేందుకు ఎవరైనా క్రియేట్ చేశారా లేక మరేదైనా కారణంతో విడుదల చేశారా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది.