పాముల కోసం బందోబస్తు..!

దిశ దశ, జగిత్యాల:

పాముల కోసం అక్కడ పోలీసులు గస్తీ చేపట్టాల్సి వచ్చింది. అధికారిక డ్యూటీ ప్రముఖల బందోబస్తు కోసమే అయినా అనుకోని అతిథుల్లా అక్కడకు చేరుకున్న పాము పిల్లలను పారదోలే పనిలో నిమగ్నం కావల్సి వచ్చింది. జగిత్యాల జిల్లా చల్ గల్ లో కేంద్రీయ విద్యాలయం కోసం శకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ వైపున వేద మంత్రోచ్ఛారణలు సాగుతుంటే మరోవైపు నుండి పాము పిల్లలకు ప్రత్యక్ష్యం అయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా పాములను చూసి షాక్ కు గురయ్యారు. అక్కడ ప్రత్యక్ష్యమైన పాము పిల్లలను పారదోలేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. శంకుస్థాపన చేపట్టిన ప్రదేశం చుట్టూ చెత్తా చెదారం కూడా పేరుకపోయి ఉండడంతో అందులోకి దూరిపోయాయి. అయినా పోలీసులు లాఠీలతో అదిలిస్తూ వాటిని అక్కడకు నుండి పంపించేందుకు శ్రమించారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు రక్షణ కల్పించేందుకు వచ్చిన పోలీసులు పాములను వెల్లగొట్టే పనిలో నిమగ్నం కావల్సి వచ్చింది.

adloori laxman kumarJAGITIAL NEWSLatest Newstelangana newsTG NEWS
Comments (0)
Add Comment