దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
ఓ ప్రేమికుడు దుస్సాహాసానికి ఒడిగట్టాడు. తను ప్రేమించి యువతిని మరోకరికి ఇచ్చి పెళ్లి చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తమ ప్రేమ వివాహాన్ని పెద్దలు కాదన్నారని కక్ష్య గట్టిన యువకుడు ఏకంగా అమ్మాయిని వివాహం చేసుకుంటున్న యువకుడి సొంత ఊర్లో వాల్ పోస్టర్లు అంటించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో చోటు జరిగిన ఈ ఘటనల స్థానికంగా సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లాకు చెందిన తామిద్దరం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తమ ప్రేమను అంగీకరించని యువతి తల్లిదండ్రులు మరోకరికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని, తంగళ్లపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అతను ఆరోపిస్తున్నాడు. అయితే తమ ప్రేమ విషయం గురించి యువకుడికి చెప్పినప్పటికీ 16 తులాల బంగారం కోసం ముందుకు వచ్చాడని ప్రేమికుడు వాల్ పోస్టర్లలో పేర్కొన్న తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అమ్మాయికి ఇష్టం లేకపోయిన ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఒప్పించారని అందులో పేర్కొన్నాడు. ఈ వాల్ పోస్టర్లను ఏకంగా యువతిని పెళ్లీ చేసుకునేందుకు ముందుకు వచ్చిన యువకుడి గ్రామమంతటా అతికించడం సంచలనంగా మారింది. అర్థరాత్రి వేళ ఓ కారులో వచ్చి గ్రామమంతా పోస్టర్లను అంటించిన సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది.