ఎలా బయటకు వచ్చింది..? జగిత్యాల అసెస్ మెంట్ కాపీపై చర్చ

దిశ దశ, జగిత్యాల:

రాష్ట్రంలోని మునిసిపాలిటీల పరిధిలోని ఆస్తుల వివరాలన్నింటిని గతంలోనే డిజిటలైజేషన్ చేసిన తరువాత అంతా కూడా ఆన్ లైన్ లోనే వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఆస్తి అసెస్ మెంట్ కాపీ ఎలా బయటకు వచ్చిందన్నదే అంతు చిక్కకుండా పోతోంది. హార్డ్ కాపీ వారికి ఎలా చేరింది..? మునిసిపల్ రికార్డుల గది నుండి సేకరించారా? లేక డిజిటలైజేషన్ చేసిన కాపీని డౌన్ లోడ్ చేశారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఒక వేళ రికార్డు రూం నుండి బయటకు వచ్చినట్టయితే అసెస్ మెంట్ కాపీ రోజుల తరబడి వెతకాల్సిన అవసరం ఉంటుంది. రికార్డ్ రూం ఇంఛార్జీకి తెలియకుండా లాక్ తీసే అవకాశం ఉండదు. పై అధికారుల అనుమతి లేకుండా రికార్డ్ రూం అసిస్టెంట్ ఇతరులకు కీ ఇచ్చే అవకాశం ఉండదు. ఒక వేళ ఇదే నిజమైతే… రోజుల తరబడి రికార్డు రూంలో వెతుకున్నప్పుడే బయటకు పొక్కేదని అంటున్నారు. అటు మునిసిపల్ యంత్రాంగం, ప్రజల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా ఉండే మునిసిపల్ ఆఫీసు రికార్డు రూంలో హార్డ్ కాపీ కోసం వెతికే అవకాశాలు తక్కువే అంటున్నవారూ లేకపోలేదు. అయితే మునిసిపల్ పరిధిలోని స్థానికుల ఆస్తులకు సంబంధించిన వివరాలు ఆన్ లైన్ లో ఉంటాయని సంబంధిత సైట్ నుండి డౌన్ లోడ్ చేయాలంటే లాగిన్ కంపల్సరీ చేయాల్సి ఉంటుందని సమాచారం. లాగీన్ చేసే అధికారం ఒక్క మునిసిపల్ కమిషనర్ కు తప్ప మరోకరికి లేదని తెలుస్తోంది. జగిత్యాల మునిసిపాలిటీలో లాగీన్ కు సంబంధించిన కీస్ కమిషనర్ మరో అధికారికి ఇచ్చినట్టుగా విశ్వనీయంగా తెలిసింది. సదరు అధికారి ద్వారానే అసెస్ మెంట్ కాపీ డౌన్ లోడ్ చేసుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసెస్ మెంట్ కాపీ బయటకు రానట్టయితే ఇంత దూరం వచ్చేది కాదని అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రొబేషనరీ అధికారిగా ఉన్న మునిసిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు అనువైన పరిస్థితులు కల్పించిందెవరన్న విషయంపై అధికారులకు స్పష్టత వచ్చినట్టు సమాచారం.

ఫిర్యాదు..?

అసెస్ మెంట్ కాపీపై ఫోర్జరీ సంతకం వ్యవహారంపై మునిసిపల్ కమిషనర్ జగిత్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఫిర్యాదు కూడా సిద్దం చేసిన కమిషనర్ బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. ఎఫ్ఐఆర్ జారీ అయిన తరువాత కేసు పూర్వాపరాలను పరిశీలించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. అసెస్ మెంట్ కాపీ బయటకు రావడం నుండి మొదలు ఫోర్జరీ సంతకం చేయడం వరకు జరిగిన ప్రతి పరిణామంపై దర్యాప్తు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

అదెలా..?

అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2019 నుండి ఆన్ లైన్ రికార్డులను పరిశీలించిన తరువాతే పేర్ల మార్పిడీ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్న నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల మునిసిపల్ ఆఫీసు నుండి విధానంలో మార్పులు చేస్తూ లేఖ రాసినట్టయితే ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఏమైనా వచ్చాయా లేవా అన్న వివరాలను పరిశీలించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జగిత్యాల మునిసిపాలిటీ నుండి మాత్రమే ఇలాంటి లేఖ విడుదలైన ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల లేఖ నంబర్లు పొందుపర్చనట్టయితే మునిసిపల్ కార్యాలయం నుండి వచ్చిన లేఖపై రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు తమ శాఖ ఉన్నతాధికారుల నుండి క్లారిటీ తీసుకోవల్సి ఉంటుంది. ప్రభుత్వం కొత్తగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సంబంధిత శాఖల కార్యాలయాన్నింటికి చేరుతాయి. కానీ ఓ శాఖకు పంపించి మరో శాఖకు పంపకుండా ఉండే అవకాశమే లేదు. కేవలం జగిత్యాల మునిసిపల్ కార్యాలయం నుండి వచ్చిన లేఖను ఆదారం చేసుకుని మాత్రమే హార్డ్ కాపీల విధానాన్ని అమలు చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

AssessmentJAGITIAL NEWSLatest NewsOffline dataOnline data
Comments (0)
Add Comment