రైలు దొరకలేదు… బస్సును తీసుకెళ్లాడు..!

దిశ దశ, జనగామ:

తిరుపతి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకోవాలనుకున్న ఈ వెంకన్న రైలు మిస్సయిందని ఏకంగా బస్సునే ఎత్తుకెళ్లాడు. దాదాపు 21 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో టోల్ గేట్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ సమీపంలో అద్దె బస్సు నిలిచి ఉంది. డ్రైవర్ తాళం చేతులు బస్సుకే ఉంచి దిగిపోవడంతో అందులోకి ఎక్కిన వెంకన్నడ్రైవర్ సీట్ లో కూర్చిన దర్జాగా బస్ స్టార్ట్ చేసుకుని సూర్యపేట వైపు బస్సును నడిపించుకుంటూ దాదాపు 21 కిలో మీటర్ల వరకూ వెళ్లాడు. సింగరాజుపల్లి టోల్ గేట్ సమీపంలో ఓ సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టడంతో టోల్ సిబ్బంది అతని వాలకం చూసి అనుమానించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి వెళ్లేందుకు…

ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో తిరుపతికి వెళ్దామని వెంకన్న స్టేషన్ కు చేరుకునే సరికి ట్రైన్ లేదని తెలుసుకున్నాడు. దీంతో ఆర్టీసీ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న బస్సును తీసుకెళ్లాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న వెంకన్న ముందుగా రెండు రౌండ్లు బస్సును నడిపి తాను నడపగలుగుతానన్న ధీమా వచ్చిన తరువాతే సూర్యపేట వైపునకు తీసుకఎళ్లాడు. బస్సు ఎక్కిన నిద్రకు ఉపక్రమించిన తాను డ్రైవర్ సీట్ వద్దకు వెళ్లి చూసే సరికి తాళం చేతులు ఉండడంతో స్టార్ట్ చేశానని చెప్తున్నాడు. అయితే బస్సును నడిపిస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఒకరు ఏయ్ ఎటు వెల్తున్నావని అడిగితే మాది పాలకుర్తి సార్ అని చెప్పగానే సదరు వ్యక్తి వెళ్లమన్నాడని వెంకన్న చెప్తున్నాడు.

JANGAMAjangonLatest NewsTG NEWSwarangal
Comments (0)
Add Comment