దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
బిక్షాందేహీ అనగానే దానం చేసే పరిస్థితులు లేవిప్పుడు… ఇక రోడ్లపైకి వచ్చి అడుక్కునే వారికి ప్రతి ఒక్కరి నుండి ఓ మాట వినిపిస్తుంటుంది. అదే చిల్లర లేదు పో అంటుంటారు… ఈ మాట విని మరోకరి వద్దకు వెల్లి బిక్షం అడుగుతుంటారు. అయితే అక్కడ మాత్రం ఓ బిక్షగాడు సాంకేతికతను ఉపయోగించి మరీ అడుక్కుంటున్నాడు. ఓ చేత్తో దానం చేయండి సార్ అంటూనే మరో చేత్తో క్యూఆర్ కోడ్ చేయాలంటూ స్కానర్ చూపిస్తున్నాడు. దీంతో చిల్లర లేదు అనే పరిస్థితి లేకుండా పోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అడక్కుంటున్న ఓ బిక్షగాడు ఇలా స్కానర్ పట్టుకుని తిరుగుతుండడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా బిక్షగాళ్లు దానం చేయాలని కోరగానే చిల్లర లేదు పో అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంటుంది. దీంతో వారు చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్లిపోతుంటారు. చిల్లర కూడా దానం చేయవచ్చంటూ స్కానర్ పట్టుకుని తిరగాలని ఆ బిక్షగానికి ఆలోచన రావడమే విచిత్రంగా ఉందని స్థానికులు అంటున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో ఇలా క్యూఆర్ కోడ్ చూపిస్తూ బిక్షమెత్తుకుంటున్న ఘటనలు చూశాం కానీ రాజన్న సిరిసిల్ల లాంటి చిన్న పట్టణంలో కూడా ఇలా సాక్షాత్కరించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విదేశాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇతర ప్రాంతాల మాదిరిగా స్కానర్ చేయాలంటూ అఫిషియల్ బెగ్గింగ్ చేయడం ఇక్కడ కూడా ప్రారంభించారా అని స్థానికులు అనుకుంటున్నారు. సాంకేతికతను అంది పుచ్చుకుని బిక్షగాడు అడుక్కుంటున్న తీరు గురించి వైరల్ గా మారింది.