దిశ దశ, జగిత్యాల:
మరో 24 గంటల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో పట్టణంలో సంచలనం చోటు చేసుకుంది. పార్టీ నాయకులు ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా ఫ్లెక్సీలలో జీవన్ రెడ్డి ఫోటోను చింపేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
హెల్మెట్…
కొద్ది సేపటి క్రితం పట్టణంలోని పాత బస్ స్టేషన్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఫోటోలను చింపేశారు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్ ధరించి వచ్చని వ్యక్తులు ఫ్లెక్సీల్లో ముద్రించిన జీవన్ రెడ్డి ఫోటోలను మాత్రమే చింపేసి వెల్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ జెండా అడిగితే ఇవ్వనందుకే ఓ వ్యక్తి ఫ్లెక్సీని చింపివేసినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అతను బీఆర్ఎస్ పార్టీ నుండే గతంలో పోటీ చేసి గెలిచిన వ్యక్తేనని తేలింది.