కరీంనగర్ పోలీసుల రివర్స్ గేర్… దోపిడీ ముఠా ట్రేస్…

దోపిడీ ముుఠాను పట్టుకోవడంలో సక్సెస్…

దిశ దశ, కరీంనగర్:

దోపిడీ ముఠాను పట్టుకోవడంలో అన్ని రకాలుగా ప్రయత్నించిన కరీంనగర్ పోలీసులు విఫలం అవుతారనే భావించారంతా. దోపిడీ జరిగిన చాలా సేపటి తరువాత హై అలెర్ట్ ప్రకటించడంతో దోపిడీ దొంగలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారని వారు పోలీసులకు చిక్కడం గగనమేనని భావించారంతా. దోచుకున్న సొత్తును మూడో రోజుల్లోనే నగదుగా మార్చుకునే విధంగా స్కెచ్ వేసే ముఠాను పట్టుకోవడం అసాధ్యమేనని అనుకున్నారంతా. ముఠాను పట్టుకోవడంలో అన్నింటా విఫలం అయ్యారన్న అపవాదును ఎదుర్కొన్నప్పటికీ పోలీసులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఛాలెంజ్ గా తీసుకున్న కమిషనరేట్ పోలీసులు ఎట్టకేలకు సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ కంప్లీట్ కానుందని సమాచారం.

రివర్స్ గేర్…

దోపిడీ ముఠా ఏఏ రహదారుల మీదుగా వెళ్లింది, ఎక్కడి నుండి రాష్ట్రం దాటింది… ఏఏ ప్రాంతాలకు చేరుకుంది అన్న వివరాలు సేకరించిన పోలీసులు ముఠాను గుర్తించేందుకు బృందాలుగా ఏర్పడి వివిధ రాష్ట్రాలకు చేరుకున్నారు. అయితే సరిహద్దులు దాటిపోయిన ఆభరణాలు, దోపిడీ ముఠా పోలీసుల చేతికి చిక్కడం అసాధ్యమనుకున్నప్పటికీ సుసాధ్యం చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ఓ వైపున గ్యాంగ్ ఎటువైపుగా వెల్లిందో తెలుసుకుంటేనే మరో వైపున వారి స్వస్థలాలకు వెళ్లి వాకబు చేశాయి కరీంనగర్ పోలీసు బృందాలు. వారి ఆచూకి ఎక్కడా లభ్యం కాకపోవడంతో మరో వ్యూహానికి పదును పెట్టారు కరీంనగర్ పోలీసులు. దేశంలో భారీ దోపిడీలకు పాల్పడుతున్న ఈ ముఠాలు ఆభరణాలను విక్రయించేందుకు సెలెక్టెడ్ వ్యాపారులను ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని అనుమానించారు. వెంటనే కార్యరంగంలోకి దిగిన పోలీసులు చోరీ సొత్తు కొనుగోలు చేసే వ్యాపారుల డాటా సేకరించి వారిపై నిఘా వేయడంతో అసలు గుట్టు బట్టబయలైనట్టుగా తెలుస్తున్నది. చోరీ సొత్తు కొనుగోలు చేసేందుకు దేశంలో అతి తక్కువ మంది ఉన్నారని గుర్తించి ఆయా చోట్ల జరుగుతున్న క్రయవిక్రయాలపై దృష్టి సారించారు. ఈ ఒక్క క్లూ పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ కు అత్యంత బలాన్ని చేకూర్చింది. సాధారణంగా దొంగలను పట్టుకున్న తరువాత వారు ఆభరణాలను ఎక్కడెక్కడ అమ్మారో వివరాలు తెలుసుకుని గోల్డ్ రికవరీ చేయడం, చోరి సొత్తు కొనుగోలు చేశారని క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతుండే వారు. కానీ కరీంనగర పీఎంజే జ్యువెలరీ కేసులో దోపిడీ సొత్తు కొనుగోలు చేసే బంగారం ఆభరణాల వ్యాపారుల డేటా ఆధారంగా దర్యాప్తు చేసి సఫలం అయ్యారు. ఈ కారణంగానే దోపిడీ ముఠా అమ్మిన గోల్డ్ ను కూడా రికవరీ చేయగలిగారని తెలుస్తోంది.

భారీ  స్కెచ్…

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠా పోలీసులకు తెలియకుండా క్రయ విక్రయాలు చేసేందుకు పకడ్భందీగా వ్యవహరిచినట్టుగా తెలిసింది. దోపిడీ సొత్తును తమ నెట్ వర్క్ ద్వారా వ్యాపారులకు చేరవేసి సమాచారం అందిస్తారని తెలుస్తోంది. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దొపిడీకి పాల్పడిన ముఠా గోల్డ్ బ్యాగ్ ఓ చోట దాచి పెట్టి వ్యాపారులకు అప్పగించే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. వీరు దాచిపెట్టని చోట నుండి ఆ బంగారు ఆభరణాలు వ్యాపారుల వద్దకు తరలించినట్టుగా సమాచారం. అయితే గతంలో వేసిన ప్రతి స్కెచ్ సక్సెస్ అయినప్పటికీ కరీంనగర్ దోపిడీ తరువాత  డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా మారిపోయింది ఈ ముఠా పరిస్థితి.

భారీ ఎత్తున…

దేశం నలుమూలల సంచరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఈ ముఠా పోలీసులకు చిక్కకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తారని సమాచారం. ఇప్పటి వరకు ఈ ముఠా దేశ వ్యాప్తంగా 30 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను ఎత్తుకెల్లినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం వీరిని పట్టుకోవడంలో అంతగా సఫలం కాలేదని, ఒక వేళ సక్సెస్ అయినా ఎత్తుకెళ్లిన ఆభరణాలను రికవరీ చేయలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కరీంనగర్ పోలీసులు మాత్రం వీరిని గుర్తించడంతో పాటు సొత్తు రికవరీలో రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

నలుగురు..?

దోపిడీ ముఠాకు చెందిన నలుగురిని కరీంనగర్ కమిషనరేట్ స్పెషల్ టీమ్ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దోపిడీలో కీలకంగా వ్యవహరించిన మరోకరిని అదుపులోకి తీసుకోవల్సి ఉందని సమాచారం. వీరిని కరీంనగర్ కు తరలించే పనిలో నిమగ్నమైనట్టుగా సమాచారం. ఎత్తుకెళ్లిన చోరీ సొత్తును కూడా పోలీసులు స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారని సమాచారం.

crimekarimnagarLatest NewsTG NEWStg police
Comments (0)
Add Comment