నకిలీల దందాపై కొరడా… నేరాల కట్టడి…

అడిషనల్ డీసీపీ వెంకటరమణ

దిశ దశ, కరీంనగర్:

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు విభాగంలో సేవలు అందిస్తున్న ఆ పోలీసు అధికారి చూడడానికి సౌమ్యునిగా కనిపిస్తున్నా… చట్ట వ్యతిరేక శక్తులను అణిచివేయడంలో కఠినంగా వ్యవహరిస్తారు. పోలీసు విభాగంలో చేరిన తరువాత ఆయన నేరాలను ఛేదించడంలో తన మార్క్ ప్రదర్శన చూపించారు. 1991లో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పి వెంకట రమణ సహచర పోలీసుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా ప్రసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ కు ఎంపిక అయ్యారు. ప్రస్తుతం కరీంనగర్ కమిషనరేట్ లో అడిషనల్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెకంటరమణ నేపథ్యం ఇది…

హైదరాబాద్…

హైదరాబాద్ జోన్ లో 1991లో ఎస్సైగా పోస్టింగ్ పొందిన వెంకట రమణ సున్నితమైన అంశాలను సునిశితంగా పరిశీలించి పరిష్కరించడంలో సఫలం అయ్యారు. అప్పడు నెలకొన్న పరిస్థితుల కారణంగా తరచూ భాగ్యనగరంలో మత కల్లోలాలు చోటు చేసుకుంటూ ఉండేవి. ఈ గొడవలను ఎక్కడికక్కడ నిలువరించేందుకు వెంకటరమణ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వర్తించిన సమయంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. 2005లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ చత్రినాక, ముషీరాబాద్, అంబర్‌పేట్, జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహించారు. 2005లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ చత్రినాక, ముషీరాబాద్, అంబర్‌పేట్, జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వహించారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన సమయంలో మాండ్రక్స్ (NDPS) కేసు, అక్రమ ఆయుధాల స్వాధీనం, నార్త్ ఇండియన్ గ్యాంగ్స్, నకిలీ స్టాంపుల కేసులు, నకిలీ ఇందిరా వికాస్ పత్రాలు, గంజాయి పట్టివేత, నకిలీ సర్టిఫికెట్లు తదితర కీలక కేసుల ఛేదనలో ఆయన కీలక పాత్ర పోషించారు. జడ్చర్ల ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన సమయంలో హత్యలు, హైవే దోపిడీలు, గ్యాంగ్‌రేప్ కేసులను ఛేదించడంలో సక్సెస్ అయ్యారు. 2017లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన హైదరాబాద్ ట్రాఫిక్, గోపాలపురం, నార్త్ జోన్, టీఎస్ విజిలెన్స్, ఎస్‌ఆర్ నగర్ వెస్ట్ జోన్ తదితర ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2025 మే 22న అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన, 2025 జూన్ 2 నుంచి కరీంనగర్ కమిషనరేట్‌లో అదనపు డీసీపీ (అడ్మిన్)గా విధులు నిర్వహిస్తున్నారు.

పురస్కారాలు…

పి వెంకట రమణ తన విశిష్ట సేవలకు తెలంగాణ పోలీస్ సేవా పతకం, తెలంగాణ పోలీస్ ఉత్తమ సేవా పతకం, యూనియన్ హోం మినిస్టర్స్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్–2022 వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. వీటితో పాటు 107 క్యాష్ రివార్డులు, ఒక అడ్వాన్స్ ఇంక్రిమెంట్, 7 ప్రశంసా పత్రాలు, 4 అభినందనలు, 15 MSEలు, 162 GSEలు అందుకున్నారు.

తాజాగా…

తాజాగా కేంద్ర ప్రభుత్వం వెంకట రమణను ‘President’s Police Medal for Meritorious Service’ (PPM/MSM) ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్‌లో భాగంగా ఆయన ఈ గౌరవానికి ఎంపికయ్యారు.

సీపీ సన్మానం…

అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణను సీపీ గౌష్ ఆలం ఘనంగా సత్కరించారు. దేశంలోనే అత్యున్నతమైన మెడల్స్ లో ఒకటైన ప్రెసిడెన్షియల్ పోలీస్ మెడల్ కు అడిషనల్ డీసీపీ ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.

KARIMNAGAR POLICEPPM/MSMtelangana newsTELANGANA POLCETG NEWS
Comments (0)
Add Comment