వ్యూహాలు ఫెయిల్ అయినట్టేనా..?

జన సమీకరణ కట్టడికి ప్రత్యర్థుల ప్రయత్నం…

దిశ దశ, జగిత్యాల:

జీ‘వన్’ రెడ్డిగా మిగల్చాలన్న ప్రయత్నం ఫెయిల్ అయిందా..? జన సమీకరణ కట్టడికి ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయా..? ఆయన్ని ఒంటరిగా చేయాలన్న ప్రయత్నాలు సఫలం కాలేకపోయాయా..? జీవన్ రెడ్డి రాజీనామాకు ముందు అసలేం జరిగింది..?

వెంట వెళ్లకుండా…

కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తన అభిమానులు, అనుచరులతో వ్యక్తిగతంగా చర్చించారు. ఫోన్ చేసి తనకు అండగా నిలబడాలని కోరారు. జగిత్యాల పూర్వ, ప్రస్తుత నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల వారిని తనతో కలిసి రావాలని రాజీనామా ప్రకటన రోజున తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. బండారి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి జగిత్యాల ప్రాంత వాసులను ఆహ్వానించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే జీవన్ రెడ్డి తనతో అనుభందం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసిన సమాచారం తెలుసుకున్న ఆయన ప్రత్యర్థులు కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని ఆయనతో కలిసి వెళ్లవద్దని అభ్యర్థిస్తూ ఫోన్లు చేశారు. దీంతో జీవన్ రెడ్డిని బలహీన పర్చాలని భావించినప్పటికీ లాభం లేకుండా పోయిందని రాజీనామా ప్రకటన రోజు సభతో స్పష్టం అయింది.

టార్గెట్ రీచ్…

3 వేల మంది సమక్షంలో తన రాజీనామా ప్రకటన చేయాలని, పార్టీ తనకు చేసిన అన్యాయం గురించి ఎకరవు పెట్టాలనుకున్న జీవన్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. ఆయన పిలుపు మేరకు వచ్చిన వారితో గార్డెన్స్ నిండిపోయింది. పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక దాదాపు ఖాయం అయిపోయిన తరువాత తనకు ఎలా అన్యాయం చేశారు..? రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు సమిసిపోయి ఆయనకు అనుకూలంగా ఉండేందుకు తాను ఎలా చొరవ తీసుకున్నాను..? అయినా తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా బాధించారోనన్న విషయాలను వివరించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. తన లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని స్పష్టం చేసిన జీవన రెడ్డి అమితుమీకి సిద్దం అన్నరీతిలో తన ప్రసంగాన్ని కొనసాగించడం గమనార్హం.

మరో ఎత్తు…

అయితే జీవన్ రెడ్డి మరో వ్యూహంతో ముందుకు సాగనున్న్టట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అసమ్మతీయులను చేరదీయాలన్న యోచనలో ఉన్నట్టుగా సమాచారం. పార్టీ పిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాలతో పాటు సీఎం రేవంత్ వ్యతిరేకులను ఒక చోటకు చేర్చే ప్రయత్నాల్లో నిమగ్నం కానున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

BRS PARTYCongressJAGITIAL NEWST JEEVAN REDDYTELANGANA POLITCS
Comments (0)
Add Comment