లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలు…

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కేసులు…

దిశ దశ, కరీంనగర్:

ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారా..? ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు మా సంస్థ కల్పిస్తోంది సువర్ణావకాశం. మా సంస్థలో చేరండి శిక్షణ పొందండి… ఉద్యోగం సంపాదించండి అంటూ ప్రకటనలు గుప్పిస్తూ నిరుద్యోగుల ఆశలే పెట్టుబడిగా చేసుకుంటున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. Private Security Agencies Regulation Act-2005 (PSARA) నిబంధనలను అనుసరించి లైసెన్స్ తీసుకోకుండా అక్రమంగా సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసులు ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కమిషనరేట్ వ్యాప్తంగా దాడులు చేసిన పోలీసులు ఏడు ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దాదాపు 146 మంది సెక్యూరిటీ గార్డులకు ఉపాధి కూడా కల్పించిన ఆయా సంస్థల గురించి సమగ్రంగా ఆరా తీశామని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వెల్లడించారు. గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ 1, 2 టౌన్లు, చొప్పదండి పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న ఏడు సెక్యూరిటీ ఏజెన్సీలు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోలేదన్నారు. ఆయ ఏజెన్సీల నిర్వాహకులపై PSARA Act-2005 సెక్షన్ 20, 22 మరియు BNS సెక్షన్ 318(4) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీలు లెసెన్స్ తీసుకున్న తర్వాతే కార్యకలాపాలు కొనసాగించాలని లేనట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Gaush Alam IPSKARIMNAGAR POLICEPSARA Act-2005security agenciesTG NEWS
Comments (0)
Add Comment