రౌడీ షీటర్ల ఇంటి బాట… సీపీ వినూత్న ప్రయోగం…

​దిశ దశ, కరీంనగర్:

రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లను పిలిపించడం… స్టేషన్ ఆవరణలో నిలబెట్టడం… ఒక్కొక్కరి పేరుతో పిలిచి కేసుల వివరాలు చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని ఆదేశించడం… హద్దు మీరితో జైలుకు పంపిస్తామని హెచ్చరించడం ఇదంతా గతం…

ఏం చేస్తున్నావు..? ఏఏ కేసుల్లో ఉన్నావు..? నేరం ఎందుకు చేశావు..? కుటుంబం పరిస్థితి ఏంటీ..? ఫ్యామిలీని పెంచి పోషించేందుకు ఏ వృత్తిలో స్థిరపడ్డావు..? నేర ప్ర వృత్తికి దూరంగా ఉంటున్నావా  లేదా అన్న ప్రశ్నలు వేసి వివరాలు సేకరిస్తున్న తీరు ప్రస్తుతం…

కరీంనగర్ కమిషనరేట్ లో సీపీ గౌష్ ఆలం సరికొత్త పంథా ఎంచుకున్నారు. పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయడం, క్రైం డిటైల్స్ సేకరించడం, పోలీసు యంత్రాంగం ప్రవర్తన తీరు తెలుసుకోవడంతోనే సరిపెట్టడం లేదు. స్టేషన్ కు వచ్చే బాధితులు, నేరస్తుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, నేర చరిత్ర ఉన్న వారి పట్ల సంబంధిత ఠాణా అధికారులు దృష్టి సారించారా లేదా అన్న వివరాలను తెలుసుకుని సంతృప్తి చెందడం లేదు.

ఇంటికే…

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తీగలగుట్టపల్లి చంద్రపుర్ కాలనీలోని ఓ రౌడీ షీటర్ రోమాల ఉదయ్ అలియాస్ అభి ఇంటికి వెళ్లారు. రౌడీ షీటర్ కుటుంబ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పోషణ కోసం ఏం వృత్తి చేస్తున్నావని ఉదయ్ ని ప్రశ్నించిన సీపీ అతని తల్లిదండ్రుల గురించి కూడా వాకబు చేశారు. ప్రస్తుతం వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాని అభి సీపీకి వివరించారు. అతనిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి వాటి వివరాలు ఏంటీ అన్న వివరాలు కూడా అభిని అడిగి తెలుసుకున్న సీపీ గౌష్ ఆలం అతని భార్యతో కూడా మాట్లాడారు. అభిని సన్మార్గంలో పెట్టేందుకు చొరవ తీసుకోవాలని నిరంతరం నేరాలు చేస్తూ కాలం వెల్లదీస్తే జైలు జీవితం గడపాల్సి వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఆమెకు సూచించారు. ఉదయ్ పై ఉన్న కేసుల గురించి తెలుసా అని ప్రశ్నించిన ఆయన నేర ప్రవృత్తికి దూరంగా ఉండేందుకు చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. క్రిమినల్ చర్యలకు దూరంగా సాధారణ జీవనం సాగించాలని సీపీ ఉదయ్ కి స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడినట్టయితే మరిన్ని కేసులు నమోదు చేయాల్సి వస్తుందని దీంతో పీడీ యాక్ట్ వంటి చట్టాలు అమలు చేస్తే జైలుకే జీవితం పరిమితం అవుతుందని ఉదయ్ ని హెచ్చరించారు. సీపీ వెంట కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, సీఐ నిరంజన్ రెడ్డిలు కూడా ఉన్నారు.

cp karimnagarGaush Alam IPSKARIMNAGAR POLICErowdy sheetersTG NEWS
Comments (0)
Add Comment