సైదాపూర్ మండలంలో ఏసీబీ ట్రాప్…

దిశ దశ, హుజురాబాద్:

సైదాపూర్ మండలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మండల రెవెన్యూ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. బాధితుని నుండి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా  సర్వేయర్ కుమారస్వామిని పట్టుకున్నారు. బాధితుని నుండి సర్వేయర్ కుమారస్వామి తన ప్రైవేటు అసిస్టెంట్ తీగల రాజేష్ ద్వారా లంచం తీసుకున్న సర్వేయర్ కుమార స్వామికి కెమికల్ టెస్ట్ నిర్వహిచడంతో పాటు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. మండలంలోని ఓ రైతుకు సంబంధించిన భూమిని కొలిచేందుకు రూ. 25 వేలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.   మే 23న రూ. 5 వేలు యూపీఐ పేమెంట్ ద్వారా, జూన్ 2వ తేదిన మరో ప్రైవేట్ అసిస్టెంట్ విహిత్ రెడ్డి ద్వారా రూ. 10 వేలు తీసుకోగా శుక్రవారం రూ. 10 వేలు తీగల్ రాజేష్ ద్వారా తీసుకుంటుండగా పట్టుకున్నారు.

ఇద్దరు అసిస్టెంట్లు..!

ఓ సాధారణ మండల సర్వేయర్ ఇద్దరు ప్రైవేటు అసిస్టెంట్లను పెట్టుకుని కార్యకలాపాలు కొనసాగిస్తుండడం గమనార్హం. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాలను పోషించుకోవల్సిన రాజేష్, విహిత్ రెడ్డిలను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం ముగ్గురిని ఈ కేసులో అరెస్ట్ చేస్తుండడం చర్చకు దారి తీస్తోంది. భూమి కొలతలకు సంబంధించిన సర్వేయర్ సైదాపూర్ లాంటి చిన్న మండలంలో ఇద్దరు ప్రైవేటు అసిస్టెంట్లను నియమించుకున్న తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.