అల్ఫోర్స్ విద్యార్థులకు ‘‘నీట్’’ర్యాంక్స్…

దిశ దశ, కరీంనగర్:

విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు అల్ఫోర్స్ ఇనిస్ట్యూషన్స్ మరో అరుదైన ఘనతను అందుకుంది. ప్రాంతీయ స్థాయిలో జరిగే పరీక్షల్లోనే కాదు… జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్టుల్లో కూడా తమ సత్తా చాటుకున్నారు అల్ఫోర్స్ స్టూడెంట్స్. నీట్–2026 ఫలితాల్లో “అల్ఫోర్స్” అద్భుతమైన ఫలితాలను సాధించి విద్యారంగంలో తనదైన ముద్రను వేసుకుంది.

ఫలితాలు ఇలా…

విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలను గుర్తించి వారిని సుశిక్షుతులుగా తయారు చేయడంలో అల్ఫోర్స్ అధ్యాపక బృందం నిర్విరామంగా శ్రమించింది. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు కూడా తమలోని జిజ్ఞాసకు పదును పెట్టారు. నీట్ 2026 ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా…
డి రిత్విక్ 647, సిద్దాంత్ చతుర్వేది 564, సయ్యద్ మలాజుద్దీన్ 557, వసుల శ్రుత్విక 551, గులామ్ మహమ్మద్ హుస్సేన్ 548, బత్తుల అభిజ్ఞ 541, లింగంపల్లి అనంత్ సాయి 540, నార్ల శ్రీహిత 538, శ్రేయాంశ్ ద్వివేది 537, కొండ్ల అక్షిత 522, బొమ్మవరపు రుత్విక్ 515, జక్కుల శ్రీవైత్రి 512, టి. హర్షిత 509, సిద్దం సాత్విక 508, ఎ సత్య బ్రాహ్మిణి 507, బి అక్షర 505, నిద 502, గుంజేటి రిషిత 501, జహ్రా మాజీద్ 501 మార్కులు సాధించారు. నీట్ DOCTORS-30 ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా కోచింగ్ అందించడం ద్వారా అల్ఫోర్స్ విజయపరంపర కొనసాగుతోందని అల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ వి నరేందర్ రెడ్డి వెల్లడించారు. 19 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించగా 100 మంది విద్యార్థులు పలు ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించనున్నారని తెలిపారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోదన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అకుంటిత దీక్ష, పట్టుదల, కృషి వల్లే ఇంతటి ఘన విజయం సాధించామని నరేందర్ రెడ్డి అన్నారు. తక్కువ మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఎక్కువ ఫలితాలు సాధించామన్నారు. నీట్, ఐఐటి విద్యార్థులను విజయ పథాన నడిపిస్తున్న సంస్థ అల్ఫోర్సేనన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని ఫలితాల్లో అల్ఫోర్స్ ముందంజలో ఉండడం సంతోకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్దికై కృషి చేస్తున్న తమ విద్యా సంస్థలను ఆదరించిన తల్లిదండ్రులు పిల్లలను చేర్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ముందు ముందు కూడా మెడికల్, ఐఐటి మరియు ఎన్ఐటీలలో సీట్లు సాధించేందుకు విద్యార్థులను సుశిక్షుతులుగా తయారు చేస్తామని ప్రకటించారు. ర్యాంకులు సాధించిన మా అల్ఫోర్స్ అణిముత్యాల్లాంటి విద్యార్థులను అభినందించిన నరేందర్ రెడ్డి ఇంతటి సక్సెస్ కు తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.