ఎక్సైజ్ అధికారుల దాడులు…
దిశ దశ, హైదరాబాద్:
ఆదాయం గడించేందుకు లిక్కర్ మాఫియా చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు హై క్లాస్ మద్యం బాటిళ్లను ఖాలీ చేసి చీప్ క్వాలిటీ లిక్కర్ నింపుతుండగా మరో వైపున ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా నడుచుకుంటున్నారు. కొత్తగా లైసెన్స్ తీసుకున్న షాపుల్లో గతంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న ఈ దందాపై ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దాడులు చేసింది. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నడుస్తున్న మంజునాథ వైన్స్ లో 2023-25 లిక్కర్ పాలసీకి సంబంధించిన మద్యం అమ్మకాలు చేస్తున్నారని సమాచారం అందుకున్నారు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వైన్ షాపు యజమాని ఇంట్లో సీఐ మహేష్ ఆద్వర్యంలో సోదాలు చేపట్టారు. 14 రకాల మద్యానికి చెందిన 198 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, మద్యాం బాటిళ్లను చిక్కడపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

