సెలూన్ కెళ్లాడు… చేయి చేసుకున్నాడు… ఎస్సైపై చర్యలు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లోని ఓ సెలూన్ కెళ్లిన ఎస్సై నాయి బ్రాహ్మణునిపై అకారంగా చేయిచేసుకున్నాడు. శనివారం ఉదయం ఖాన్ పురాలోని ఓ సెలూన్ షాపుకు వెళ్లిన ఎస్సై చందర్ సెలూన్ లో ఉన్న రాములతో మాట్లాడాడు. కటింగ్ చేయాలని ఎస్సై అడగగా కొంచెం సేపు ఆగండి అన్న అని రాములు అనడండంతో కోపంతో అతనిపై చేయి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కరీంనగర్ టౌన్ ఎసీపీ వెంకటస్వామి ఆరా తీసి  ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశారు. త్రిటౌన్ సీఐ తిరుమల్ కూడా బాధితుడు రాములుతో మాట్లాడి అసలేం జరిగిందో అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఎస్సై చందర్ ను కమిషనరేట్ కు అటాచ్డ్ చేసినట్టు తెలుస్తోంది.