కరీంనగర్ లో కాల్పుల కలకలం… నగల దుకాణంలో చోరీ…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కోర్టు చౌరస్తా సమీపంలోని జ్యోతీనగర్ లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి చొరబడ్డ అగంతకులు తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలు దోచుకుని అక్కడి నుండి పరార్ అయ్యారని ప్రాథమిక సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీఎం, ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. జ్యోతినగర్ లోని  పీఎంజె (PMJ) జ్యువెల్లరీస్ లోకి ఆదివారం ఉదయం ఐదుగురు అగంతకులు చొరబడి దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.