పార్టీ ఆఫీసులో వ్యాపారం ఎలా చేస్తారు..? రెవెన్యూ శాఖ నోటీసులు

దిశ దశ, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు రెవెన్యూ అధికారులు పార్టీ కార్యాలయంలో టీవీ కార్యాలయం ఏర్పాటు చేయడం సరికాదంటూ నోటీసులు ఇచ్చారు. పార్టీ ఆఫీసు నుండి టీ న్యూస్ ఛానెల్ ను ఎప్పటి వరకు తరలిస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో అడిగిన రెవెన్యూ అధికారులు 2011 నుండి కూడా తెలంగాణ భవన్ లోనే టీ న్యూస్ ఛానెల్ కార్యాలయం నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఛానెల్ నిర్వహణ నిభందనలకు విరుద్దమంటూ ఎవరూ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. రాజకీయ పార్టీ కార్యాలయంలో వ్యాపార దృక్ఫథంతో ఏర్పాటు చేసే సంస్థలు ఉండకూడదన్న నిభందనలను ప్రకారం రెవెన్యూ అధికారులు బీఆర్ఎస్ భవన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా టీ న్యూస్ చానెల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా నోటీసుల ఇవ్స్పవడంతో  స్పష్టం అవుతోంది.

BRS PARTYcm revanth reddyKCRt newstelangana bhavan
Comments (0)
Add Comment