దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పి శ్రీశైలం నిజామాబాద్ సీసీఎస్ కు, సంకెల్ల వెంకటేష్ సీఐడీకి, కంప రవిందర్ రామగుండం సీసీఎస్ కు, సి విజయ రాజ్ పీఎస్ఎస్ అండ్ ఎస్ చీఫ్ ఆఫీస్ హైదరాబాద్, జి వెంకటేశ్వర్లు సిరిసిల్ల ఎస్బీకి, బొబ్బల ప్రవీణ్ ఇంటలీజెన్స్ కు, బూర శ్రీనివాస్ నార్త్ జోన్ రోడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ అయ్యారు. ఎం వెంకటనర్సయ్య ఆదిలాబాద్ డీసీఆర్బీ ఫంక్షనల్ వర్టికల్స్ విభాగానికి, జి మహేందర్ రెడ్డి, గోర్ల శ్రీనివాస్ రెడ్డి సివిల్ విభాగానికి, బి బాలజీ సిద్దిపేట టాస్క్ ఫోర్స్ కు, అడప నర్సింహరావు ఖమ్మం సీసీఆర్బీకి, ఎం వెంకట రామయ్య సివిల్ కు, పబ్బతి వెంకటేశ్వర్లు సీఐడీకి, కీత రామకృష్ణ సీఎస్ డబ్లూ ఏసీగా, ఫ్యూచర్ సిటీకి అటాచ్డ్, కొసగి భాస్కర్ సిరిసిల్ల డీసీఆర్బీ ఫంక్షనల్ వర్టికల్ విభాగానికి, పి కరుణాకర్ రెడ్డి హైదరాబాద్ ఎస్బీకి, ఎం వెంెకటరెడ్డి ఇంటలీజెన్స్, పార రాజు టీజీ సీఎస్బీ, నూనె వెంకటేశ్వర్లు సివిల్, జి గోవర్దనగిరి హైదరాబాద్ సిటీ ఎస్బీకి, ఎస్ వెంకటేశ్ సైబరాబాద్ క్రైమ్స్, బి గురు నాయుడు ఆదిలాబాద్ సీసీఆర్బీ ఫంక్షనల్ వర్టికల్, భూపతి గట్టు మల్లు కామారెడ్డి సీసీఆర్బీ ఫంక్షనల్ వర్టికల్, బి హరినాథ్ బాబు సీటీసీ ఖమ్మం, చిలుక రాజిరెడ్డి సీఐడీకి, ఆర్ నరేందర్ నిజామాబాద్ టాస్క్ ఫోర్స్, ఆవుల రాజయ్య ఇంటలీజెన్స్, బొలగాని శ్రీనివాస్ రామగుండం టాస్క్ ఫోర్స్, ఎ పెద్దన్న కుమార్ అంబర్ పేట పీటీసీకి, తోటిచర్ల స్వామి కరీంనగర్ సీసీఆర్బీ ఫంక్షనల్ వర్టికల్ విభాగానికి, టి ప్రవీణ్ కుమార్ రామగుండం సీసీఎస్ కు, కె పురుషోత్తం సైబరాబాద్ ఎస్బీ, సర్ల రాజు సీసీఎస్ అండ్ డిడి హైదరాబాద్, గడ్డం సదన్ కుమార్ సిద్దిపట సీసీఎస్, ఎం రాజేష్ సివిల్ విభాగానికి బదిలీ చేస్తూ డీజీపీ సీవి ఆనంద్ ఉత్తర్వులు విడుదల చేశారు.