కేసీఆర్ బాపూ… సింగరేణి కార్మికుల ప్లకార్డులు…
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో సింగరేణి కార్మికులు తమ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన కార్మికులు ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం.
మెడికల్ బోర్డు…
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది. డిపెండెంట్ ఉద్యోగాలు, మారు పేర్ల సమస్య, లాభాల వాటాలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. సింగరేణి నిధులను దోచుకుంటూ నష్టాల్లో ఉందని చెప్తున్న ప్రభుత్వం. తెలంగాణాలో ఎక్కడ చూసినా హైడ్రా పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు కేసీఆర్ నే ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో పోయింది అధికారం మాత్రమే, తెలంగాణ ప్రజల గుండెల్లో అభిమానం మాత్రం పోలేదు. అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు.