పేరు సవరణ కోసం లంచం: ఏసీబీకి పట్టుబడ్డ జీపీఓ

దిశ దశ, జగిత్యాల:

పట్టాదారు పాసు పుస్తకలంలో పేరు తప్పుగా పడిందని దానిని సవరించాలని కోరిన రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు జీపీఓ. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు జీపీఓగా పని చేస్తున్న రాజేశ్ ఓ రైతు నుండి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో గురువారం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పినాప్తలిన్ టెస్ట్ ద్వారా జీపీఓ రాజేష్ లంచం తీసుకున్నట్టుగా తేల్చారు. అతన్ని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ACB TELANGANAACB TrapJAGITIAL NEWSLatest NewsTELANGANA ACB
Comments (0)
Add Comment