తూర్పున తాజా… పశ్చిమాన మాజీ

ఒకే రోజు రెండు భారీ బహిరంగ సభలు…

ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ హీట్…

దిశ దశ, కరీంనగర్:

ఓ వైపున భానుడి భగభగలు… మరో వైపున రాజకీయ నాయకుల విమర్శనాస్త్రాలతో ఉమ్మడి జిల్లాలో హీట్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పున ముఖ్యమంత్రి, పశ్చిమాన మాజీ ముఖ్యమంత్రుల పర్యటనలు ఖరారయ్యాయి. ఒకే రోజున వీరిద్దరూ బహిరంగ సభలకు హాజరవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

చాలా కాలం…

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 20న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. జగిత్యాలలోని వివేకానంద స్టేడియంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జమీకరణ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ సభ కోసం నియోజకవర్గాల వారిగా ఇంఛార్జీలను నియమించి మరీ  విజయవంతం కోసం ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న అంశాన్ని అందిపుచ్చుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్న యోచనలో గులాభి దళం ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ అధినేత ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు తక్కువే. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్నిప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. పార్టీ నాయకులు ఎర్రవెల్లికి వెల్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న సందర్భాలే ఎక్కువ. తాజాగా జగిత్యాల సభకు కేసీఆర్ వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకున్నట్టయింది. కేసీఆర్ ప్రసంగించనున్న ఈ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ నిప్పులు చెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జీవన్ రెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకుంటున్న ఈ వేదిక మీదుగానే బీఆర్ఎస్ పట్టు బిగించే విధంగా  నాయకత్వం కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ప్రసంగం కోసం పార్టీ శ్రేణులు కూడాా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి. 

                                             

మేడిగడ్డ వేదికగా…

ఇదే రోజున కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వేదికగా గులాభి పార్టీని ఇరుకున పెట్టాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా స్ఫష్టం అవుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తేదిన మేడిగడ్డ టూర్ తో పాటు నస్తూరుపల్లి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ముహూర్తం పిక్స్ చేశారని సమాచారం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తులను పరిశీలించనున్నారు సీఎం. ఈ సందర్భంగా మేడిగడ్డ రిపేర్ల గురించి చర్చించడంతో పాటు పుష్కరాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయ. అదే రోజున కాటారం, మహాదేవపూర్ మార్గ మధ్యలోని నస్తూరుపల్లి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా బుధవారం ధన్వాడలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాల కారణాలతో పాటు పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి తన ప్రసంగం కొనసాగించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రయత్నాలను తిప్పికొట్టాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, ఇందులో బాగంగానే నస్తూరుపల్లి వేదికను వినియోగించకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. 

BRS PARTYcm revanth reddyCongressJAGITIALkaleshwaramKCR
Comments (0)
Add Comment