కొలిక్కి వస్తున్న రాబరీ కేస్…

దిశ దశ, కరీంనగర్:

మీరట్ నుండే మానిటరింగ్ చేశారు… ఇంటి దొంగలే వ్యూహం పన్నారు… అత్తింటిపై కక్ష్య కట్టిన అల్లుడే దోపీడికి పూనుకున్నాడు. కరీంనగర్ భగత్ నగర్ లో ఇంట్లో జరిగిన రాబరీ కేసు మిస్టరీని కరీంనగర్ పోలీసులు ఛేదించారు. కేసును ఛేదించేందుకు మీరట్ కు వెళ్లిన పోలీస్ బృందం దోపిడీలో పాల్గొన్న నిందితులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుని దోపిడీ ముఠా గురించి కులంకశంగా తెలుసుకున్న పోలీసు అధికారులు మీరట్ వెళ్లిన పోలీసు బృందాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేయడంతో కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ఇంటి అల్లునితో పాటు అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తి ప్రమేయం ఉందని పోలీసులు నిర్దారించారు. వీరితో పాటు మరో ముగ్గురిని కూడా ఈ ముఠాలో చేర్చుకుని అజ్మత్ అలీ ఇంట్లో దోపిడీకి స్కెచ్ వేసినట్టుగా స్పష్టం అయిపోయింది. దోపిడీ జరిగిన రోజే అల్లునిపై అత్తింటి వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్లూ ఆధారం చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు దోపిడీకి పాల్పడిన ముఠాను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకునే పనిలో మీరట్ లో ఉన్న పోలీసు బృందం నిమగ్నం అయింది. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం దృవీకరంచలేదు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు మాత్రమే పాల్గొన్నట్టుగా కూడా తేల్చారు పోలీసులు. రాబరీ జరిగిన తరువాత ఆరు నుండి ఎనిమిది మంది ఈ దోపిడీలో పాల్గొన్నారని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ వాస్తవంగా మాత్రం ఐదుగురి ప్రమేయం ఉందని గుర్తించినట్టుగా సమాచారం. 

crimeKARIMNAGAR POLICELatest NewsRobbery GangTG NEWS
Comments (0)
Add Comment