ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీ కొన్న ఫార్చూనర్

దిశ దశ, మానకొండూరు:

రాష్ట్ర శాసన మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న 2కె రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కు వెల్తున్నారు. శంకరపట్నం మండలం తాడికల్ సమీపంలో రోడ్డు ప్రమాం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి సమీపంలోకి బైక్ వాలా రావడంతో డ్రైవర్ ప్రమాదాన్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అదుపు తప్పిన ఫార్చూనర్ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. వాహనంలో బెలూన్లూ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో పాటు అందులో ప్రయాణిస్తున్న వారికి భారీ ప్రమాదం తప్పినట్టయింది. అక్కడి నుండి ఎమ్మెల్సీ మరో కారులో హుజురాబాద్ కు బయలు దేరగా, స్వల్ప గాయాలైన బైక్ మీద వెల్తున్న రైతును 108లో హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు.

cm kcrcrimecrime newsCRIME TODAYkarimnagar newsLatest NewsMLC KOUSHIK REDDYtelangana news