పెద్దపల్లిలో కలకలం… లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పీపీ…

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం చోటు చేసుకుంది. లంచం తీసుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకరు ఏసీబీకి చిక్కారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం… పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో భూవివాదం కారణంగా 2023లో ఒకరు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి కోర్టులో ఈ కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో  ఓ నిందితునికి అనుకూలంగా వ్యవహరించి లబ్ది చేకూరుస్తానని పిపి డొంకెన రవిందర్ రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు రూ. లక్షా 50 వేలు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. అయితే సదరు బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి బుధవారం లంచం తీసుకుంటున్న పీపీ రవిందర్ ను పట్టుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో గల రవిందర్ ఇంట్లోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఫినాప్తలిన్ టెస్ట్ నిర్వహించిన ఏసీబీ అధికారులు పలువురి వాంగ్మూలాలు సేకరించారు. అనంతరం రవిందర్ ను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచేందుకు తరలించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లంచం తీసుకుంటూ పట్టుబడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ACB RAIDSACB TELANGANAACB Trapbreaking newsTELANGANA ACB
Comments (0)
Add Comment