Have indoor games been set up at the Sironcha Club? Why is the number of non-locals so high?

దిశ దశ, సిరొంచ:

గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్రంలో నడుస్తున్న ఓ పేకాట క్లబ్ లో సోదాలు నిర్వహించిన అధికారులు అక్కడ ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరగడం లేదని తేల్చారు. రెండు రోజుల క్రితం మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో అధికారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ క్లబ్ పేరిట అనుమతులు తీసుకున్నారని, అందులో సభ్యత్వం తీసుకున్న వారి వివరాలు కూడా సేకరించామని అంతా సక్రమంగానే ఉందని వెల్లడించారు. అయితే సోషల్ క్లబ్ నిర్వహిస్తున్నామని అనుమతులు తీసుకున్నప్పటికీ అక్కడ నిబంధనల మేరకే కార్యకలాపాలు కొనసాగుతున్నాయా అన్న విషయంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండోర్ గేమ్స్…

సోషల్ క్లబ్ పేరిట ఇండోర్ గేమ్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల గేమ్స్ కోసం ప్రత్యేకంగా మెటిరియట్ కొనుగోలు చేసి వాటిని అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వ నిభందనల ప్రకారం ప్రత్యేకంగా పేకాట కేంద్రం నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో సోషల్ క్లబ్ పేరిట అనుమతులు పొందిన నిర్వాహాకులు జూదగాళ్లచే పేకాట ఆడిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్లబ్ లో సభ్యత్వం తీసుకున్న వారితో పాటు గెస్ట్ మెంబర్లను ఆహ్వానించే సాంప్రాదాయం ఉంది. కానీ సిరొంచలో ఏర్పాటు చేసిన క్లబ్ లో తెలంగాణాకు చెందిన సరిహద్దు జిల్లాల వారే కనిపిస్తుండడానికి కారణమేంటన్నది అంతుచిక్కకుండా పోయింది. స్థానికులు నామమాత్రంగా ఉంటున్నారని, ఇందులో సిరొంచ ప్రాంతానికి చెందిన వారు తాత్కాలిక ఉద్యోగులుగా మాత్రమే పనిచేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సోషల్ క్లబ్ ఏర్పాటు చేసినట్టయితే క్లబ్ కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకున్నారా లేదా అన్న విషయంపై కూడా ఆరా తీయాలని అంటున్నారు స్థానికులు. జూదం కేంద్రంలో ఆడే వారి మధ్య గొడవలు చోటు చేసుకున్నట్టయితే సరిహద్దుల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

సీఎంకు..?

జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్న ఫడ్నవిస్ వ్యవహరిస్తున్నారు. ఆయన కనుసన్నల్లో ఉన్న జిల్లాలోని సిరొంచ తాలుకా కేంద్రంలో సోషల్ క్లబ్ పేరిట చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న విషయంపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సహ పాలక్ మంత్రికి ఫిర్యాదు చేసినప్పటికీ నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న పేకాట క్లబ్ మూసివేయనందున సీఎం దృష్టికి తీసుకెళ్లడమే సముచితమని సిరొంచ ప్రాంత వాసులు భావిస్తున్నారు.

gadchirolinational newspoker centerPOKER CLUBsironcha
Comments (0)
Add Comment