చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలు… 

నియంత్రించాలని  అడ్వకేట్ వినతి

దిశ దశ, కరీంనగర్:

చిట్ సంస్థలు రికవరి చేసే విధానంలో చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని, వాటి ఆగడాలు కట్టడి చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు కరీంనగర్ కు చెందిన న్యాయవాది ఏవి రమణ.  పలు సంస్థలు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనీయంగా ఉందని  ఆరోపించారు. “కపిల్” “మార్గదర్శి”లతో పాటు పలు చిట్ సంస్థలు రికవరీ చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయని ఆరోపించారు.

ఏం చేయాలి?

వాస్తవంగా చిట్ సభ్యులు సదరు సంస్థలకు చెల్లించాల్సిన డబ్బులు కట్టనట్టయితే సంస్థలు మొదట Arbitrationను సంప్రదించాలి. ఇక్కడి నుండి డిఫాల్టర్లకు నోటీసులు పంపించాలి. అయితే చాలా సందర్భాల్లో ఈ నోటీసులు పార్టీలకు, ష్యూరిటీదారులకు అందకుండా మేనేజ్ చేస్తున్నారని ఏవి రమణ ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత పార్టీలు స్పందించడం లేదని adverse order పొందుతున్నారు. ఈ అడ్వర్స్ ఆర్డర్ అమలు చేయాలని అభ్యర్థిస్తూ సివిల్ కోర్టును ఆశ్రయిస్తున్నాయి చిట్ సంస్థలు. ఇక్కడి నుండి పంపించే నోటీసులు కూడా చిట్ సభ్యులకు, ష్యూరిటీదారులకు పంపించాలి. కానీ ఈ నోటీసులు కూడా సంబంధిత పార్టీలకు చేరకుండా చిట్ సంస్థలు మేనేజ్ చేసుకుంటున్నాయని రమణ అంటున్నారు. కానీ ఆ నోటీసులు పార్టీలు తీసుకున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నోటీసులు ముట్టినట్టుగా కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ చిట్ సంస్థలు తమకు అనుకూలంగా ఆర్డర్స్ పొందుతున్నాయని ఏవి రమణ చెప్తున్నారు. ఆ తర్వాత EP (EXECUTION PETITION) MOVABLE ATTACHMENT WARRANT పొంది రికవరీ టీమ్స్ ను పంపించి వేదింపులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారెంట్ జారీ కోర్టు సిబ్బంది మాత్రమే చేయాల్సి ఉంటుందని వివరించారు. కానీ చిట్ సంస్థల ప్రతినిధులే వీటిని తీసుకుని పార్టీల వద్దకు వెలుతున్నారన్నారు. రికవరీ టీమ్స్ పార్టీల ఇండ్లలోకి వెళ్లి అటాచ్ చేస్తున్నాయని, రికవరీ వ్యవస్థను ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకోవడం కూడా నిబంధనలకు విరుద్దమేనని అడ్వకేట్ ఏవి రమణ అంటున్నారు.

ఫిర్యాదు…

చిట్ సంస్థల తీరుపై కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఫిర్యాదు చేశానని ఏవి రమణ తెలిపారు. ష్యూరిటీ దారులు, చిట్ సభ్యుల సంతకాలు చిట్ ఎత్తుకున్నప్పుడు డాక్యూమెంట్లపై పెడతారని, నోటీసులపై ఉన్న సంతకాలతో వాటిని సరి చూసుకున్న తరువాతే అటాచ్డ్ ఆర్డర్స్ ఇవ్వాలని  కోరారు.

chitfundchitsLatest Newstelangana newsTG NEWS
Comments (0)
Add Comment