డంపింగ్ యార్డ్ హఠావో… హుజురాబాద్ బచావో…

ప్రభుత్వానికి 24 గంటల డెడ్ లైన్…

బీజేపీ ఆందోళన

దిశ దశ, హుజురాబాద్:

డంపింగ్ యార్డ్ హఠావో… హుజురాబాద్ బచావో అంటూ బీజేపీ శ్రేణులు నినదించాయి. డంపింగ్ యార్డ్ రద్దు చేస్తూ 24 గంటల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేనట్టయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించాయి. హుజురాబాద్ సమీపంలోని సిర్సపల్లి వద్ద వేస్ట్ టు ఎనర్జీ ద్వారా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేసిన బీజేపీ నాయకులు డంపింగ్ యార్డ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. డంపింగ్ యార్డ్ యథావిధిగా కొనసాగించాలని చూస్తే కాంగ్రెస్ సర్కార్ కు హఠావో ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించారు. బీజేపీ ఆందోళనతో వరంగల్, కరీంనగర్ హైవేపై బారీగా వాహనాలు నిలిచిపోయాయి.

bjp newsBJP TELANGANAhuzurabadHZBLatest News
Comments (0)
Add Comment