సీపీగా మహంతి, కలెక్టర్ గా సత్పతి

దిశ దశ, కరీంనగర్:

ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బదిలీ అయిన కరీంనగర్ పోలీస్ కమిషనర్, కలెక్టర్ ల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు, కలెక్టర్ రవిలను బదిలీ చేస్తూ గత శుక్రవారం ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి స్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కరీంనగర్ పోలీసు కమిషనర్ గా అభిషేక్ మహంతి, కలెక్టర్ గా పామెలా సత్పతిలను నియమించారు. 2011 బ్యాచ్ కు చెందిన అభిషేక్ మహంతి ప్రస్తుతం రాచకొండ ట్రాఫిక్ వన్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2015 బ్యాచ్ కు చెందిన పామెలా సత్పతి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

2023 assembly electionsAbhishek Mahanty as the new CP of Karimnagar and Pamela Satpathy as the Collectorkarimnagar newsLatest Newstelangana news