ఐ.ఐ.టి అడ్వాన్స్ డ్-2026 ఫలితాలలో “అల్ఫోర్స్” అఖండ విజయం

దిశ దశ, కరీంనగర్:

ఐ.ఐ.టి అడ్వాన్స్డ్- 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిద క్యాటగిరీలలో జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాదించారు. కె. ప్రజ్ఞాన్ దీపక్ 75, సి. హెచ్. లక్ష్మీ హాసిని 400, ఎన్. రత్నప్రకాశ్ 497, బి. లిఖిత్ సాయి 785, ఎమ్. వశిష్ఠ 800, బి. స్పందన 954, కె. ధనుష్ 1294, ఎమ్. జోహన్ 1400, పటేల్ అక్షయ 1488, సి.హెచ్. అభిరామ్ రావు 1618, ఎ. సత్యవర్ధన్ 1678 ర్యాంకులు సాధించి ‘‘అల్ఫోర్స్” ఖ్యాతిని మరింత పెంచారని విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. ఆరు మంది వెయ్యి లోపు, 11 మంది 2000లలోపు, 19మంది 3000ల లోపు ర్యాంకులు సాధించారన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన నిరంతర పర్యవేక్షణ విద్యార్థులు అహర్నిషలు కృషి ఘన విజయానికి కారణమని నరేందర్ రెడ్డి అన్నారు. ఎప్సెట్-2026లో అల్ఫోర్స్ విధ్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారని, కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమంగా ఐ.ఐ.టి. కోచింగ్ అంధించి అనేక మంది విధ్యార్థులు ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి.లలో సీట్లు సాధించే విధంగా తీర్చిదిద్దిన మొదటి ఏకైక విద్యాసంస్థ అల్ఫోర్స్ మాత్రమేనన్నారు. ప్రతి సంవత్సరం అల్ఫోర్స్ అందించిన అద్భుతమైన ఐ.ఐ.టి కోచింగ్ ద్వారా ఐ.ఐ.టిలలో సీట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరగిందన్నారు. రాబోయే నీట్-2026 ఫలితాలలో కూడా అల్ఫోర్స్ చిన్నారులు అద్భుత ర్యాంకులు సాధిస్తారని విశ్వసిస్తున్నాను ప్రకటించారు. ఐఐటి-2026 ఫలితాలలో అద్భుత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ అణిముత్యాలను వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందించారు వి నరేందర్ రెడ్డి. ఇంతటి ఘనవిజయానికి తోడ్పడిన మా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. విద్యార్థుల్లోని ఆసక్తిని గుర్తించి వారిని సుశిక్షుతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ తయారు చేయడం వల్లే అన్ని రంగాల్లో అల్ఫోర్స్ తనదైన ముద్ర వేస్తోందని నరేందర్ రెడ్డి ప్రకటించారు. వివిధ రాష్ట్రాలలో విద్యరంగంలో సేవలను విస్తరించినా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు పకడ్భందీగా ముందుకు సాగడంలో సక్సెస్ అవుతున్నామన్నారు. ఇదే స్పూర్తితో భవిష్యత్ లో విద్యారంగంలో అత్యంత అరుదైన మైళ్లను చేరుకుంటామని అల్ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.