శాతవాహనలో అసలేం జరుగుతోంది… అర్బన్ నక్సల్స్ ఉనికి ఉందా..?

ఫిర్యాదుల పరంపర…

దిశ దశ, కరీంనగర్:

శాతవాహన యూనివర్శిటీలో అర్బన్ నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ వరస ఫిర్యాదులు చేస్తుండడం సంచలనంగా మారింది. నిషేధిత సంస్థల నిర్మాణం జరుపుతున్నారని వరసగా ఫిర్యాదులు చేస్తుండడం విశేషం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్శిటీలో నిషేధిత సంస్థలకు చెందిన ప్రతినిధులు గతంలో పీజీ చేసి మరోసారి పీజీ అడ్మిషన్ తీసుకుని నిషేధిత సంస్థల కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ బుధవారం వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ కు ph.D స్కాలర్స్ ఫిర్యాదు చేశారు. విశ్వ విద్యాలయం ప్రతిష్టను, యూనివర్శిటీ వాతావరనాన్ని చెడగొట్టే విధంగా అర్బన్ నక్సల్స్ వ్యవరిస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల క్యాంపస్ ప్లేస్ మెంట్లు, ఇతర ఉద్యోగావకశాలు లభించడం కష్టం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ph.D స్కాలర్ నైతం మహేష్ మాట్లాడుతూ… విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారం రోజులుగా అర్బన్ నక్సల్స్ యూనివర్శిటీలో ఉంటూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతంలో నిషేధిత మావోయిస్టు సంస్థలలో పనిచేసి అలజడులు సృష్టించారని, ఇప్పుడు కూడా ఇదే విధమైన అల్లర్లు చేసే ప్రయత్నాలు చేస్తుండడం ఆందోళన కల్గిస్తోందని నైతం మహేష్ అన్నారు. అర్బన్ నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని వారికి సహకరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కాలర్స్ బోడకుంట రమేష్, నైతం సాయి కృష్ణ, కుంజ వర్మతేజలు పాల్గొన్నారు. ఇదే విషయంలో ఇప్పటికే జిల్లాకలెక్టర్, సీపీ, వైస్ ఛాన్సలర్లకు ఫిర్యాదులు వెళ్లాయి. శాతవాహన యూనివర్శిటీలో అర్బన్స్ నక్సల్స్ కార్యకలాపాలపై తరుచూ ఫిర్యాదులు చేస్తుండడం విశేషం.