ప్రోటోకాల్ విస్మరించారు… ఎమ్మెల్యే గంగుల ఫైర్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. అధికారిక కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేశారు గంగుల కమలాకర్. నూతన కలెక్టరేట్ ఆవరణలో రూ. 2 కోట్లతో హెలిప్యాడ్, ఉత్తర ద్వారం, మెయిన్ రోడ్ తదితర పనులకు శ్రీకారం చుట్టారు. సుడా నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోటోకాల్ ప్రకారం అధికారులు నడుచుకోవడం లేదని, సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఆయన అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది.