దిశ దశ, కరీంనగర్:
పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తూ సంచలనాత్మక విజయాలను నమోదు చేసే విధంగా విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ వారి కలలను సాకారం చేస్తున్నామని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… SSC ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడం అల్ఫోర్స్ విద్యా విధానానికి గొప్ప ప్రతికగా నిలిచిందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తున్నారని, తరగతి గదిలో బోధిస్తున్న అంశాలపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అసాధరాణ ఫలితాలను అందిపుచ్చుకుంటున్నారని కితాబిచ్చారు. అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఆర్ సాత్విక్ 589 మార్కులతో అగ్రస్థానంలో నిలివగా, ఒ ఆద్య, టి.రాజు, బి.అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించారన్నారు. మొత్తం 1274 మంది విద్యార్థులకు గాను 1026 మంది 500లకు పైగా మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులు పైగా, 334 మంది విద్యార్థులు 560 మార్కులు పైగా సాధించడం అల్ఫోర్స్ టైనీ టాట్స్ టీచింగ్ టీమ్ చేసిన కృషి షలితమేనని వి నరేందర్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి అద్భుతమైన విజయాల సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఉపధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం పిల్లలకు ప్రోత్సాహం అందిస్తూ లక్ష్యాల వైపు పయనించే విధంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వారి పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు మరియు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధింపచేసినందుకు నరేందర్ రెడ్డి గారిని తల్లిదండ్రులు ప్రశంసిస్తూ అభినందించారు మరియు ఘనంగా సత్కరించారు.


