జగిత్యాల గులాభి దళంతో కేటీఆర్ భేటీ…

జీవన్ రెడ్డి విషయంపై చర్చ…

దిశ దశ, జగిత్యాల:

మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే విషయంలో ఆ పార్టీ అధిష్టానం ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు ఆయన రాకను స్వాగతిస్తున్నామని ప్రకటనలు చేశారు. ఈ నేఫథ్యంలో వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకులతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఆయన చేరిక తరువాత జిల్లా నాయకత్వం సమన్వయంతో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలన్న విషయంపై చర్చించినట్టుగా సమాచారం. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంతతో పాటు పలువురు నాయకులు కేటీఆర్ తో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.