దిశ దశ, హైదారబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు సోదాలు చేపట్టాయి. భూముల రిజిస్ట్రేషన్ విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా..? ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా సానుకూలత ప్రదర్శిస్తున్నారా అన్న విషయాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఏక కాలంలో రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు చేయాలని విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశించారు. దీంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. జీఎస్టీ ఎగవేత, పాన్ కార్డుల వినియోగం వంటి అంశాలతో పాటు స్టాంప్ డ్యూటీ కలెక్షన్ తీరుపై కూడా ఆరా తీశాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యూమెంట్ రైటర్ల జోక్యంపై కూడా దృష్టి సారించినట్టుగా సమాచారం. కరీంగనర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు.