పెద్దమ్మ తల్లి మీరే న్యాయం చేయాలి…

శేజల్ సూసైడ్ నోట్ ఇదే

దిశ దశ, హైదరాబాద్:

పెద్దమ్మ తల్లి మీరే న్యాయం చేయాలి… తెలంగాణ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని గత ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నాను… సీఎం కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ ఎదో ఒక రోజు నా బాధను అర్థం చేసుకుంటారని పోరాడానంటూ శేజల్ రాసిన లేఖకు సంబందించిన కొంత మ్యాటర్ దిశ దశకు చిక్కింది. కొంత భాగం మిస్సయినప్పటికీ దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ బాధ వివరంగా అందులో పేర్కొన్నట్టుగా స్పష్టం అవుతోంది. తాను లైంగిక వేదింపులకు గురి కాలేదని అనడం బాధించినట్టుగా ఆమె అందులో పేర్కొంది. ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఇంటి వద్ద నిరసన తెలిపినప్పుడు నన్ను పిలిపించుకుని మాట్లాడారు… నన్ను కూతురులా చూసుకుంటామన్నారు నాకు న్యాయం చేస్తామన్నారు, నాతో పాటు నా కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని కూడా చెప్పారని చివరకు తనకు ఎలాంటి సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు శేజల్. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాయ మాటలు నమ్మకండి… నా ఊసురు ఖచ్చితంగా తగులుతుందటూ శాపనార్థలు పెట్టారు. దుర్గం చిన్నయ్య మంచోడని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో నాకు న్యాయం జరగదని భావిస్తున్నాను. ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందని నమ్మకం లేదు… అమ్మా పెద్దమ్మ తల్లి నువ్వే నాకుటుంబానికి అండగా ఉండాలి… ఈ ద్రోహులను నువ్వే శిక్షించాలి. ఈ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి శేజల్ అను నేను బలవుతున్నాను… కనీసం నీదగ్గరయినా నాకు మనశ్శాంతి దొరుకుతుందని భావిస్తున్నాను అంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు రాసిన సూసైడ్ నోట్ కలకలం సృష్టిస్తోంది.

cm kcrcrimecrime newsCRIME TODAYKCRLatest NewsMINISTER KTRMLA Durgam Chinnaiah victimSejal's suicide noteSHEJALtelangana news