పెట్రోకార్ లో అవి కంపల్సరీ… అధికారుల ఆదేశాలు…

దిశ దశ, కరీంనగర్:

పెట్రో కార్ లో కొన్నింటిని విధిగా అట్టిపెట్టుకోవాలిన పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గస్తీ చేపట్టేందుకు వెళ్లే పోలీసు అధికారులు ఖచ్చితంగా వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అత్యవసర వేళల్లో వినియోగించేందుకు అనువుగా ఉండాలని స్పష్టం చేశారు.

ఆ ఘటనతో…

ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న క్రమంలో నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్  ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడ బందోబస్తు చేస్తున్న పోలీసుల వద్ద మంటలను ఆర్పేందుకు అవసరమైన సిలెండర్, బ్లాంకెట్ వంటివి లేకపోవడంతో అతన్ని కాపాడలేకపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు వినియోగించే పెట్రో కార్ లలో మంటలను ఆర్పేందుకు వినియోగించే సిలిండర్ (Fire Extinguisher Cylinder), వాటర్ క్యాన్, బ్లాంకెట్ ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బందోబస్తులో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైనట్టయితే పెట్రో కార్ లో ఉండే వీటిని ఉపయోగించి బాధితులను కాపాడే అవకాశం ఉంటుందని బావిస్తున్నారు. దీంతో పెట్రో కార్ లో సిలిండెర్, బ్లాంకెట్, వాటర్ క్యాన్ లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలు, కమిషనరేట్ ల పరిధిలోని పోలీసు అధికారులు. 

Fire Extinguisher CylinderFire SafetyLatest Newstelangana newsTG NEWS
Comments (0)
Add Comment